Oral Cancer: మీరు తరుచూ ఆ పని చేస్తున్నారా.. అయితే మీకు నోటి క్యాన్సర్ ఉన్నట్లే..

Oral Cancer Symptoms: మన ఆరోగ్యానికి అలవాట్లే ప్రధాన కారణం. పొగాకు తాగేవారు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. నోటి క్యాన్సర్ లక్షణాలు, చికిత్స విధానం గురింతి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 11:57 AM IST
Oral Cancer: మీరు తరుచూ ఆ పని చేస్తున్నారా..  అయితే మీకు నోటి క్యాన్సర్ ఉన్నట్లే..

Oral Cancer Symptoms: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజూకీ పెరిగిపోతుంది. పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మన జీవనశైలిలో మార్పులే దీనికి ప్రధాన కారణం. 

సిగరెట్లు కాల్చడం, సిగార్లు పీల్చడం, పొగాకు నమలడం, గుట్కా, పాన్ మసాలా వంటివి తినడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో పొగాకు, మధ్యపానమే మౌత్ క్యాన్సర్ కు కారకాలు. భారతదేశంలో 80 శాతానికి పైగా కేసులు వీటి వల్లే వస్తున్నాయి. ప్రస్తుతం రోజుల్లో చిన్న వయసులోనే సిగరెట్లు, మందు తాగడం వంటివి చేస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే నోటిక్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం ఉంది. నోటి క్యాన్సర్ లక్షణాలేంటో ఓసారి తెలుసుకుందాం. 

నోటి క్యాన్సర్ లక్షణాలు
** నమలడం, మింగడం, మాట్లాడటం లేదా నాలుకను కదిలించడంలో మీకు ఇబ్బంది కలుగుతుంది. 
** నోటి లోపల పుండ్లు ఏర్పడి అవి ఎంతకీ తగ్గకపోవడం.
** దంతాలు కోల్పోవడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ తాగడం, మద్యం సేవించడం మరియు నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల పళ్లు ఊడిపోతాయి.  
** ఆహారాన్ని నమలడం లేదా మింగేటప్పుడు నొప్పిని కలిగిస్తుంటే అది కూడా దీని లక్షణం.

 నోటి క్యాన్సర్ చికిత్స
క్యాన్సర్ రకం, స్టేజ్ ను బట్టి ట్రీట్ మెంట్ ఇస్తారు. సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటివి చేస్తారు. మౌత్ క్యాన్సర్ చికిత్స చాలా బాధాకరమైనది మరియు ఖర్చుతో కూడికున్నది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Green Tea: గ్రీన్ టీలో వీటిని కలిపి తాగితే... క్యాన్సర్ తో సహా చాలా వ్యాధులు దూరం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News