Ajwain For Diabetes: మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం (Diabetes) కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఈ వ్యాధి సాధారణమై పోయింది. వృద్ధులనే కాదు యువతను కూడా తన గ్రిప్‌లోకి తీసుకుంటున్న పరిస్థితి. అందుకే డయాబెటిక్ రోగులు (Diabetes Patients) వారి ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సాధారణంగా మనం వామును (Ajwain) దీన్ని కర్రీస్, చట్నీలు, మిర్చిబజ్జీల్లో వాడతాం. కానీ దీనిలో అనేక ఔషధ గుణాలున్నాయి. వాము (అజ్వైన్) రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా ఏసీడీటీ, ముక్క దిబ్బడ, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు ప్రభావంతంగా పనిచేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడు తినాలి?
వాములో (Carom Seeds) యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. దీనితో పాటు, ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు భోజనం తర్వాత నేరుగా వామును తినవచ్చు. అంతేకాకుండా రోగి 10 మి.లీ నువ్వుల నూనెలో 3 గ్రాముల వాము గింజలను కలపాలి. ఆ తర్వాత రోజుకు మూడుసార్లు తినాలి. దీనితో పాటు, మీరు వాము టీ కూడా తాగవచ్చు. ఈ టీని భోజనం చేసిన అరగంట తర్వాత తాగాలని గుర్తుంచుకోండి. మీరు దీని నుండి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. 


Also Read: Facial Hair Removal Tips: ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్నాయా? అయితే ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.