Honey with Garlic: ముఖ్యంగా ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే చాలా సమస్యలకు పరిష్కారం కూడా వీటిలోనే ఉంది. ఇటీవలి కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నది అధిక బరువు సమస్యతో. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే పరిష్కారం మన కిచెన్‌లోనే ఉంది. కిచెన్‌లో లభ్యమయ్యే వస్తువులతో మెరుపు వేగంతో బరువు తగ్గించుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక కాలంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. కారణంగా వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ వంటివి మనిషి స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బరువు తగ్గించడం అంత సులభమైన విషయం కాదు. కానీ కొన్ని అలవాట్లు పాటించగలిగితే అద్భుతంగా బరువు తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ నిద్ర లేచిన వెంటనే, భోజనానికి కాస్సేపు ముందు గోరు వెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్స్ మానేసి హెల్తీ స్నాక్స్ అలవాటు చేసుకోవాలి. 


అన్నింటికంటే ముఖ్యంగా తేనెలలో నానబెట్టిన వెల్లుల్లి బరువు సమస్యకు అద్భుతమైన పరిష్కారమంటారు ఆయుర్వేద వైద్య నిపుణులు. రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున వెల్లుల్లి తింటే జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్ధాల్ని బయటకు పంపుతుంది. వెల్లుల్లి నీరు తాగడం వల్ల హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయి అద్భుతంగా తగ్గుతుంది. ప్రతిరోజూ తేనెతో వెల్లుల్లి కలిపి తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దరిచేరవు. జీర్ణవ్యవస్థ బలోపేతం కావడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. జీవక్రియ మెరుగుపడి బరువు నియంత్రణలో ఉంటుంది. 


వెల్లుల్లిని పచ్చిగా తినడంలోనే ఎక్కువ పోషకాలున్నాయి. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఓ గాజు సీసాలో తేనె పోసి అందులో వెల్లుల్లి రెమ్మలు కొన్ని వేయాలి. రెండ్రోజులు నానబెట్టిన తరువాత మూడోరోజు నుంచి రోజుకొక వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకోవడం ప్రారంభిస్తే నెలరోజుల్లోనే మంచి ఫలితాలు చూడవచ్చు. చర్మ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 


తేనె తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అజీర్ణం సమస్య తొలగిపోతుంది. శరీరంపై గాయాలుంటే వేగంగా నయమౌతాయి.అదే వెల్లుల్లి తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. 


Also read: Black Carrots For Weight Loss: ఎప్పుడైనా బ్లాక్ క్యారెట్లను చూశారా? వీటితో బరువు, కొలెస్ట్రాల్‌ వెన్నలా కరగడం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook