Fitness Drink: అధిక బరువు లేదా స్థూలకాయం పెను సమస్యగా మారుతోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాంతో అధికంగా ఉన్న బరువును తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. కొంతమంది డైటింగ్ చేస్తుంటారు. ఇంకొంతమంది వర్కవుట్స్ చేస్తుంటారు. అయినా ఆశించిన ఫలితాలు కన్పించక నిరాశ చెందుతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో ప్రధాన సమస్య అధిక బరువు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే వ్యాయామం లేదా వర్కవుట్స్ ఒక్కటే సరిపోవు. బ్యాలెన్స్ డైట్ చాలా అవసరం. అధిక బరువు నుంచి విముక్తి పొందాలంటే ఇంట్లో తయారు చేసిన కొన్ని పదార్ధాలు అద్భుతంగా దోహదపడతాయి. ఇంట్లో సొంతంగా తయారు చేసుకునే ఈ డ్రింక్స్ బరువు సమస్యను సులభంగా తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యను చాలా ఈజీగా తొలగిస్తాయి. బరువు తగ్గించుకునేందుకు ఇంట్లో సులభంగా డీటాక్స్ వాటర్ తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.


ఈ డీటాక్స్ వాటర్ అనేది సాధారణమైన పౌష్ఠికాహార డ్రింక్. దీన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో పోషకాలు చాలా ఉంటాయి. ఈ డ్రింక్ తయారు చేసేందుకు నిమ్మకాయ, పుదీనా, అల్లం, నల్ల మిరియాలు ఉంటే చాలు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరం మెటబోలిజం లేదా జీవక్రియను అద్భుతంగా పెంచుతుంది. ఫలితంగా పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది. ఇక ఈ డ్రింక్‌లో కలిపే మరో పదార్ధం పుదీనా. పుదీనా అనేది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇక అల్లం కూడా జీవక్రియను పెంచుతుంది. నల్ల మిరియాలు శరీరంలోని కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.


ఓ గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇందులో 5-6 పుదీనా ఆకులు, కొద్దిగా అల్లం రసం, అర చెంచా నల్ల మిరియాల పౌడర్ వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని ఇందులో నీళ్లు కలపాలి. ఆ తరువాత రాత్రంగా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఉదయం లేవగానే పరగడుపున తాగాలి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే 4-5 వారాల్లోనే ఫలితం కన్పిస్తుంది. అయితే డీటాక్స్ వాటర్ అనేది ఒక డైట్ మాత్రమే. వ్యాయామానికి రీప్లేస్ కానే కాదు. రోజూ ఇలా చేస్తే మీ ఆరోగ్యం, శరీరంపై సానుకూల ప్రభావం తప్పకుండా గమనించవచ్చు. ఏదైనా వ్యాధికై చికిత్స తీసుకుంటుంటే మాత్రం వైద్యుని సంప్రదించి ఈ డ్రింక్ సేవించాలి. 


ఒక్కమాటలో చెప్పాలంటే ఆరోగ్యం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. డీటాక్స్ వాటర్ అనేది మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంచుతుంది. అయితే రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. 


Also read: Diabetes in Children: తస్మాత్ జాగ్రత్త, చిన్నారుల్లో పెరుగుతున్న మధుమేహం ముప్పు, జంక్ ఫుడ్స్ కారణమా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook