Weight Gain Tips: ఇటీవలి కాలంలో చాలామంది స్థూలకాయం లేదా అధిక బరువుతో ఆందోళన చెందుతుంటారు. బరువు తగ్గించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అదే సమయంలో కొందరు బరువు పెంచుకోవాలనుకుంటారు. సన్నగా, బక్కపల్చగా ఉండే శరీరాన్ని మార్చుకోవాలని అనుకుంటారు. ఇదెలా సాధ్యమో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక బరువు ఒక్కటే కాదు అసలు బరువే లేకపోవడం కూడా సమస్యే. చాలామంది బక్కపల్చగా, సన్నగా ఉంటారు. వయస్సు, ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండరు. దీనివల్ల ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తవచ్చు. ఎందుకంటే ఆరోగ్యకరమైన మనిషి ఎప్పుడూ తగినంత బరువు కలిగి ఉండాల్సిందే. అదే సమయంలో బక్కపల్చగా ఉండటం వల్ల నలుగురిలో అసౌకర్యంగా కూడా ఉంటుంది. అందుకే బరువు పెరిగేందుకు రకరకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. సన్నగా బక్కపల్చగా ఉండటం వల్ల బట్టలు కూడా సరిగ్గా ఫిట్ కావు. అయితే వేసవి స్పెషల్ ఫ్రూట్ మామిడితో బరువు పెంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.


మామిడి సీజనల్ ఫ్రూట్. కేవలం ఎండాకాలంలో మాత్రమే లభిస్తుంది. మామిడి అంటే ఇష్టం లేనివారు బహుశా ఎక్కడా ఉండరు. బరువు పెరిగేందుకు మామిడి చాలా అద్భుతంగా పనిచేస్తుందంటారు. మనిషి శరీర బరువు పెంచడంలో మామిడిలో కార్బోహైడ్రేట్లు అద్భుతంగా ఉపకరిస్తాయి. మామిడితో బరువు వేగంగా ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం..


1. వేసవి కాలంలో లభించే మామిడి పండ్లతో బరువు పెంచుకోవచ్చు. మామిడి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఓ గ్లాసు పాలలో ఈ ముక్కల్ని వేసి సేవించాలి. ఇలా తినడం వల్ల పాలు, మామిడి కాంబినేషన్ కారణంగా బరువు పెరుగుతుంది. 


2. జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు తినే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ , మామిడి పండ్లు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


3. సహజసిద్దంగా చెట్టుకు పండిన మామిడి పండ్లే తినాలి. కెమికల్స్ తో పండించినవి తింటే ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నమౌతాయి. 


4. బరువు పెరిగేందుకు డైట్ ఒక్కటే సరిపోదు. దీనికోసం వ్యాయామం కూడా చేయాలి. బరువు తగ్గేందుకే కాదు పెరిగేందుకు సైతం వ్యాయామం అవసరం


5. డైట్లో మామిడిపండ్లు తప్పకుండా ఉండాలి. రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల కారణంగా బరువు పెరుగుతుంది.


Also read: Papaya Seeds: బొప్పాయి గింజలతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడూ డస్ట్ బిన్‌లో వేయరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook