Tomoto, Lemon Juice for Dark Circles: ప్రతి ఒక్కరూ తమ తమ కళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాలనుకుంటారు. అయితే కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలు, మచ్చలు కంటి అందాన్ని పాడు చేస్తాయి. ఈ సమస్యను సులభంగానే పరిష్కరించుకోవచ్చు. సులభమైన చిట్కాలు పాటిస్తే చాలు. అదెలాగా చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్గత ఆరోగ్యంతో పాటు బాహ్య ఆరోగ్యాన్ని సైతం పరిరక్షించుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా అందానికి కేరాఫ్‌గా నిలిచే కళ్లను అత్యంత జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. కళ్లను ఆరోగ్యంగా చూసుకోవడమే కాకుండా కంటి చుట్టూ ఏ విధమైన సమస్యల్లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కంటి కింద నల్లటి మచ్చలు, డార్క్ సర్కిల్స్ వంటివి లేకుండా చూసుకోవాలి.


ఈ సమస్యను దూరం చేసేందుకు చాలామంది ఖరీదైన క్రీమ్స్ వినియోగిస్తుంటారు. వీటిలో కెమికల్స్ ఉండటం వల్ల ఆశించిన ఫలితాలుండవు. అదే సమయంలో దుష్పరిణామాలు కూడా తలెత్తవచ్చు. అయితే ఈ సమస్యలకు సులభంగా టొమాటోలు ఉపయోగించి ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. టొమాటోలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్ నల్లటి వలయాల్ని దూరం చేస్తుంది. 


Also Read: Low Blood Pressure: ఈ ప్రాణాయామంతో కేవలం 10 రోజుల్లో లో బీపీ మాయం..


కంటి కింద డార్క్ సర్కిల్స్ సమస్యను తొలగించేందుకు టొమాటో అండర్ ఐ మాస్క్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముందుగా ఓ చిన్న బౌల్ తీసుకోవాలి. ఇందులో టొమాటో జ్యూస్, నిమ్మ రసం కలపాలి. ఆ తరువాత ఈ రెండింటినీ బాగా కలపాలి.. అంతే మీక్కావల్సిన టొమాటో అండర్ ఐ మాస్క్ తయారైనట్టే. ఈ ప్యాక్ రాసేముందు ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.  ఆ తరువాత ఓ దూదితో కంటి కింద రాసుకోవాలి. దాదాపు 10 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం చేయడం వల్ల మంచి ఫలితాలు వేగంగా కన్పిస్తాయి. దీనివల్ల క్రమంగా నల్లటి మచ్చలు దూరమౌతాయి.


టొమాటో ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. స్కిన్ బర్న్ సమస్య నుంచి ఉపశమనం కల్గిస్తుంది. టొమాటో అనేది చర్మం డ్రైనెస్ దూరం చేయడమే కాకుండా చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది. టొమాటోలో ఉండే బ్లీచింగ్ గుణాలు మీ చర్మం రంగును తేలేలా చేస్తాయి. ఫలితంగా చర్మం నిగనిగలాడుతుంది. కంటి కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ చాలా త్వరగా దూరం చేయవచ్చు.


Also Read: Oatmeal Face Mask: ఓట్ మీల్ ఫేస్ ఫ్యాక్‌తో ఎలాంటి చర్మ సమస్యలైనా సరే కేవలం 5 రోజుల్లో చెక్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook