Surya Bhedi Pranayama: సూర్యభేది ప్రాణాయామంతో 10 రోజుల్లో మీ BP మొత్తం హుష్ ఖాకీ!

Surya Bhedi Pranayama for Blood Pressure: సూర్యభేది ప్రాణాయామం ప్రతి రోజు చేయడం వల్ల రక్తపోటు సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా తీవ్ర దర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 17, 2023, 06:59 PM IST
Surya Bhedi Pranayama: సూర్యభేది ప్రాణాయామంతో 10 రోజుల్లో మీ BP మొత్తం హుష్ ఖాకీ!

Surya Bhedi Pranayama will reduce Low Blood Pressure In 10 Days: ప్రతి రోజు యోగా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయి. ముఖ్యంగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. హై బీపీ, లో బీపీ సమస్యలతో బాధపడేవారు రోజు సూర్య భేది ప్రాణాయామం చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల గుండెపోటు సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ  ప్రాణాయామం చేయడం వల్ల లో బీపీ సమస్యలు ఎలా తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సూర్యభేది ప్రాణాయామం చేయడం వల్ల కలిగే లాభాలు:

సూర్యభేది ప్రాణాయామం చేసేవారిలో రక్తపోటు సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లో బీపీ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఆసనం వేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి తగిన మోతాదులో ఆక్సిజన్‌ లభించి, తల తిరగడం వంటి సమస్యలు దూరమవుతాయి. మనస్సు ప్రశాంతంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?

లో బీపీ ఉన్నవారు సూర్యభేది ప్రాణాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

లో బీపీ సమస్యలతో బాధపడేవారిలో శరీర వేడి తక్కువగా ఉంటుంది. అయితే ఈ సూర్యభేది ప్రాణాయామం వేయడం వల్ల శరీరంలో వేడి శాతం పెరుగుతుంది. ఈ ఆసనాన్ని వేయడానికి ముందుగా సుఖాసన భంగిమలో కూర్చోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నడుము, మెడ, వీపును పూర్తిగా నిటారుగా ఉంచాలి. కుడి చేతి రెండు వేళ్ల సహాయంతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయాల్సి ఉంటుంది. కుడి నాసికా రంధ్రం నుంచి గాలిని పిల్చుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్రక్రియను రివర్స్‌లో చేయాలి. ఇలా ప్రతి రోజు 10 నుంచి 15 నిమిషాల పాటు చేస్తే, త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. 

ముందు జాగ్రత్తలు తప్పనిసరి:
❁ సూర్యభేది ప్రాణాయామం చేసే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
❁ ప్రాణాయామం చేసే క్రమంలో శ్వాసను ఆపడానికి బదులుగా, ఎడమ నాసికా రంధ్రం ద్వారా వేగంగా వదిలివేయండి. 
❁ ఈ ప్రాణాయామం 1-2 నిమిషాలు మాత్రమే చేయాలి. 
❁ అతిగా చేయడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. 

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News