Benefits Of Eating Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ కె, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఐరన్, కాపర్, విటమిన్ బి2 మరియు పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. సాధారణంగా ఈ గుమ్మడి గింజలను నేరుగా కాకుండా ఖీర్ మరియు లడ్డూలతో కలిపి తింటూ ఉంటారు. ఈ గుమ్మడి గింజలు మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. కాబట్టి గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి
గుమ్మడికాయ గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు వరమనే చెప్పాలి. ఈ గింజలు బీపీతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. 
మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి
గుమ్మడికాయ గింజలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తీసుకోవడం మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకే కాకుండా ఈ గింజలు శరీరంలోనో ఎన్నో అవయవాలకు మేలు చేస్తుంది. 
గుండె పనితీరు మెరుగుపరుస్తుంది
గుమ్మడికాయ గింజల్లో కొవ్వులు మరియు ఫైబర్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు అధిక మెుత్తంలో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సూపర్ గా పనిచేస్తాయి. మరోవైపు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కూడా గుమ్మడికాయ గింజలలో ఉంటాయి. ఇవి బాడీలోని చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. 
కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం
గుమ్మడికాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.  దీనిని తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు దూరమవుతాయి. 


Also Read: High Uric Acid:ఈ నూనెతో ఎంతటి కీళ్ల నొప్పులైనా 2 రోజుల్లో మాయం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి