Green Tea & Black Coffee: టీ, కాఫీ లేదా గ్రీన్ టీ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. కొంతమంది గ్రీన్ టీ ఇష్టపడితే మరికొంతమంది బ్లాక్ కాఫీ తాగుతుంటారు. ఈ రెండింటిలో..బరువు తగ్గేందుకు ఏది మంచిదో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఒక్కరిలో లేదా ఇంచుమించు చాలామందిలో సహజంగా కన్పించే సమస్య బరువు తగ్గడం ఎలా అనేది. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రెగ్యులర్ డైట్‌లో రకరకాల వస్తువులు చేరుస్తుంటారు. ఆ కోవకు చెందిందే గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ. ఈ రెండింటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీలు బాడీ మెటబోలిజంను వేగవంతం చేయడంలో దోహదపడతాయని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ఫ్యాట్ బర్న్ చేయడంలో కూడా ఈ రెండూ కీలకం. అయితే ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది ఎక్కువ ఉపయోగకరమనేది తెలుసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..


గ్రీన్ టీ


గ్రీన్ టీలో కెఫీన్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులో కైటేచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బాడీ మెటబోలిజం లేదా జీవక్రియను మెరుగుపర్చడమే కాకుండా..మెరుగైన ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. గ్రీన్ టీ సేవించడం వల్ల బరువు తగ్గుతారు. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ నిర్ణీత పద్ధతిలో తీసుకోవాలి. అయితే గ్రీన్ టీలో కెఫీన్ కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి పరిమితంగానే తీసుకోవడం మంచిది. లేకపోతే నిద్రలేమి సమస్య వస్తుంది.


బ్లాక్ కాఫీ


బ్లాక్ కాఫీను చాలామంది ఇష్టపడుతుంటారు. ప్రత్యేకించి బరువు తగ్గాలనుకునేవాళ్లు గ్రీన్ టీ కంటే ఎక్కువగా బ్లాక్ కాఫీ సేవిస్తుంటారు. బ్లాక్ కాఫీ అనేది క్రీమ్, పంచదార లేకుండా తయారవుతుంది. అందుకే బ్లాక్ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. బ్లాక్ కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి..పరిమితంగానే తీసుకోవడం మంచిది. బాడీ మెటబోలిజం పెంచడమే కాకుండా..ఎనర్జీ పెంచేందుకు దోహదమౌతుంది. 


బ్లాక్ కాఫీ మరియు గ్రీన్ టీ


శరీర బరువు తగ్గించుకునేందుకు ఈ రెండూ చాలా ఉపయోగం. రెండింటీనీ డైట్‌లో చేరిస్తే మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే బ్లాక్ కాఫీ కంటే గ్రీన్ టీ ఎక్కువ ప్రయోజనకరం. ఎందుకంటే గ్రీన్ టీలో కెఫీన్ తక్కువగా ఉంటుంది. 


Also read; Weight Loss Tips: స్థూలకాయం తగ్గించేందుకు రోజూ ఇలా తినండి చాలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook