Healthy Food For Winter: చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. సాధారణంగా చలికాలంలో చాలా మంది వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో రోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక్కడ చలికాలంలో తీసుకోవడానికి మంచి ఆహార పదార్థాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ సమయంలో వేడి వేడి ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. దీని శరీరం వెచ్చగా ఉంటుంది. చల్లికాలంఓ ఆరోగ్యకరమైన సూప్‌లు తీసుకోవడం మంచిది. అందులోను 
కూరగాయలు, మాంసం లేదా పప్పులు వంటి పదార్థాలతో చేసిన సూప్‌లు శరీరానికి  వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. వీటితో పాటు అన్నం, రొట్టె, బంగాళాదుంపలు వంటి గంధకారం శరీరానికి శక్తిని ఇస్తుంది. పాలు, పెరుగు, జున్ను వంటివి కాల్షియం, ప్రోటీన్ల పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుచుతుంది.  బాదం, జీడిపప్పు, చియా సీడ్స్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను అందిస్తాయి. వీటిని ప్రతిరోజు తినడం మంచిది.


రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు:


చలికాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ సి కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది. అందులో ఆరెంజ్ ఒకటి. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో పాటు ద్రాక్ష తీసుకోవడం మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా రాత్రి పడుకొనే ముందు పసుపు కలిపిన పాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.  పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి. 


ఇతర ముఖ్యమైన విషయాలు:


చక్కెర తక్కువగా ఉండే ఆహారాలు: చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తినడం తగ్గించడం మంచిది. 


నీరు ఎక్కువగా తాగండి: శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి రోజూ తగినంత నీరు తాగండి.


వెచ్చటి పానీయాలు: కాఫీ, టీ వంటి వెచ్చటి పానీయాలు తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.


క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


మీరు కూడా ఈ ఆహారపదార్థాలను తప్పకుండా డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


గమనిక: ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆహారం తీసుకోవడం మంచిది. ఏదైనా అనుమానం ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి.


Also Read: Soaked Badam: ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఎంత లాభమో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.