Healthy Lifestyle: ఈ డ్రింక్స్ తాగండి.. మీ శరీరం లోని టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి..
Detox Drinks : మనం తింటున్న ఆహారం కారణంగా లేక మన లైఫ్ స్టైల్ కారణంగా మన శరీరంలోకి విటమిన్స్ మినరల్స్ తో పాటు టాక్సిన్స్ కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. కానీ అవి శరీరంలోనే పేరుకుపోయి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు బాడీ డిటాక్స్ చేసుకోవడం మంచిది. మరి ఇంట్లో ఉండే కూరగాయలు లేదా ఫ్రూట్స్ తో బాడీని ఎలా డిటాక్స్ చేసుకోవాలో తెలుసుకుందాం.
Weight Loss Drinks : అనారోగ్యపు ఆహార అలవాట్ల కారణంగా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతూ ఉంటాయి. అలా కొన్నాళ్ల తర్వాత మన శరీరం లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ప్రతి చిన్న దానికి అనారోగ్యం వస్తూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం ముందుగా చేయాల్సింది డిటాక్స్ జ్యూస్ లను తాగడం. మన ఇంట్లోనే కూర్చుని ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో అద్భుతంగా పనిచేసే డీటాక్స్ జూసులు చేసుకుని తాగొచ్చు.
అందులో మొదటిది కొత్తిమీర నీరు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు నీరు బయటకు వచ్చేస్తుంది. జీవక్రియకు కూడా ఇది బాగా సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాక ఈ డ్రింక్ క్యాన్సర్ ని కూడా నివారించగల శక్తి ఉన్నది.
దోసకాయ, పుదీనా, అల్లం, నిమ్మకాయ వీటిని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శరీరం ఆల్కలైజ్ అవుతుంది. ముఖ్యంగా అల్లం మన జీర్ణవ్యవస్థకి ఎంతగానో ఉపయోగపడే ఆహార పదార్థం. అందుకే మన డైట్ లో లేదా జ్యూస్ ద్వారా అయినా అల్లం తీసుకోవడం మంచిది.
స్ట్రాక్ బెర్రీ, నిమ్మకాయ జ్యూస్ లో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇన్సులిన్ లెవెల్స్ ని కూడా నియంత్రించగల శక్తి ఉన్న ఈ జ్యూస్ వల్ల బాడీ బాగా డీటాక్స్ అవుతుంది. మన శరీరంలో ఉండే పీహెచ్ స్థాయిలను కూడా సమతుల్యం చేయడానికి ఈ డ్రింక్ ఎంతో ఉపయోగపడుతుంది.
జీలకర్ర నీళ్లు కూడా డీటాక్స్ డ్రింక్ గా పని చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు జీలకర్ర నీళ్లు ఆకలి హార్మోన్లను కూడా తగ్గించేస్తాయి. దీనివల్ల మనం త్వరగా బరువు కూడా తగ్గగలం. ఇలా బాడీ డిటాక్స్ అవడం మాత్రమే కాక జీలకర్ర వాటర్ తో వెయిట్ లాస్ కూడా సులువుగా అయిపోవచ్చు.
ఇలాంటి సింపుల్ గా ఇంట్లోనే చేసుకునే డ్రింక్స్ తో మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని సులువుగా బయటకు తరిమేయొచ్చు. అయితే వెంటనే రిజల్ట్ కనిపించకపోయినప్పటికీ రోజు ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే మన బాడీలో ఉన్న వ్యర్ధాలు మొత్తం బయటకు వచ్చేసి రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. శరీరంలో కొత్త ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది.
Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter