Summer Fruits: ఈ పండ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. వెంటనే మానేయండి
Fruits in Summer: అసలే వేసవికాలం ఎండలు మండిపోతూ ఉంటాయి. బయట ఉండే వేడి వల్ల మనం తెచ్చుకునే పండ్లు కూడా పాడైపోతాయి.. అని కొందరు వాటిని ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్ లో పెట్టకూడని కొన్ని పండ్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Fruits Not to be Stored in Refrigerator: వేసవికాలం మొదలవడం ఆలస్యం ముందుగా అందరూ చేసే పని ఫ్రిజ్ నిండా పండ్లు కొనుక్కొని రావడం. సమ్మర్ లో ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ కొన్ని పండ్లని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఫ్రిజ్ లో పెడితే పండ్లు ఎక్కువ కాలం వస్తాయని త్వరగా పాడవకుండా ఉంటాయి అని చాలామంది ఫ్రూట్స్ ని ఫ్రిజ్ లో పెట్టేస్తూ ఉంటారు.
కొన్ని పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని పండ్ల విషయంలో ఫ్రిజ్ లో పెట్టకుండా బయట రూమ్ టెంపరేచర్ లో ఉంచడమే చాలా మంచిది. ఫ్రిజ్ లో పెట్టి తిన్న ఫ్రూట్స్ వల్ల ఆరోగ్యం చెడిపోతుంది తప్ప వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అసలు ఫ్రిజ్ లో పెట్టకూడని కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జామ పండ్లు:
జామ పండ్లకు నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచివైన జామ పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల జామ పళ్ళు తేమని పీల్చుకొని త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి జామ పండ్లను ఫ్రిజ్ లో పెట్టకుండా బయట రూమ్ టెంపరేచర్ లోనే వదిలేయడం చాలా మంచిది.
పనస పండు:
పనసకాయ అంటేనే వేసవికాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ అని అందరికీ తెలిసిందే. అలాంటి సీజనల్ ఫ్రూట్ ని ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. పనస తొనలను తీసిన వెంటనే తినడం చాలా మంచిది. ఒకవేళ అలా కుదరకపోయినప్పటికీ బయట రూమ్ టెంపరేచర్ లో వదిలేయడం వల్ల అందులో ఉండే పోషకాలు తొలగిపోకుండా ఉంటాయి.
అరటి పండ్లు:
అరటిపండ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి చాలా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఫ్రిజ్ లో ఉండే చల్లదనం అరటిపండ్లను త్వరగా పాడుచేస్తాయి. కాబట్టి అరటి పండ్లను ఫ్రిజ్ లో కాకుండా ఏదైనా గాలి తగిలి ప్రదేశంలో ఉంచడమే మంచిది.
మామిడిపండు:
సమ్మర్ రాగానే చాలామంది మామిడిపండు ప్రియులు.. ఫ్రిజ్ నిండా మామిడిపళ్ళతో నింపేస్తారు. కానీ మామిడిపళ్ళను ఫ్రిజ్ లో స్టోర్ చేయడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. మామిడి పండ్లను బయట పెట్టడం వల్ల ముడుచుకుపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. అందుకని చాలామంది వాటిని ఫ్రిజ్ లో పెట్టేస్తూ ఉంటారు. కానీ మామిడి పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల తాజాదనం పక్కన పెడితే దాని రుచి మొత్తం పోతుంది. అందుకనే ఏదైనా గాలి తగిలే గిన్నెలో మామిడిపళ్ళను పెట్టి చీకటిగా ఉండే ప్రదేశంలో స్టోర్ చేసుకోవటం మంచిది.
కట్ చేసిన ఫ్రూట్స్:
ఎలాంటి పండ్లు అయినా కట్ చేశాక వెంటనే తినేయడమే ఆరోగ్యానికి మంచిది. అలా కాకుండా కట్ చేసిన ఫ్రూట్స్ ఫ్రిజ్ లో పెట్టడం వల్ల దాంట్లో ఉండే విటమిన్లు తగ్గిపోతాయి. కాబట్టి ఏ పండు అయినా సరే ముక్కలుగా కట్ చేశాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter