Wrinkle Problem: ముఖంపై ముడతలు బాధిస్తుంటే..ఈ స్వీట్‌తో నిత్య యౌవనం మీ సొంతం
Wrinkle Problem: ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండానే ముఖంపై ముడతలు ఏర్పడుతున్నాయి. ముడతల కారణంగా వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తూ అందం దెబ్బతింటోంది. వయస్సు మీరకుండానే తలెత్తుతున్న ఈ సమస్యకు పరిష్కారమెలా..
Wrinkle Problem: మనిషికి అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో బాహ్య ఆరోగ్యం కూడా అంతే అవసరం. చర్మ సంరక్షణ లేకపోతే వృద్ధాప్యంలో కన్పించే లక్షణాలు ముందే కన్పిస్తాయి. ముఖంపై ముడతలు ఏర్పడి అందవిహీనంగా కన్పిస్తుంటారు. అయితే ఈ సమస్యకు సహజసిద్ధంగా లభించే ఓ స్వీట్ పదార్ధంతో పరిష్కారం లభిస్తుందంటే నమ్మగలరా..
వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నిద్ర లేమి, ఒత్తిడి ఇలా వివిధ కారణాల వల్ల చర్మ సంరక్షణ సరిగ్గా ఉండటం లేదు. ఫలితంగా తక్కువ వయస్సుకే ముఖంపై ముడతలు ఏర్పడుతున్నాయి. చర్మం కాంతి కోల్పోయి నిర్జీవంగా మారుతోంది. ముడతలతో పాటు పింపుల్స్, యాక్నే, కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడి అందమంతా దెబ్బతింటోంది. ముఖంపై ముడతల వల్ల వయస్సు పెరిగినట్టుగా కన్పిస్తోంది. కొంతమంది అవసరానికి మించి మేకప్ చేసుకోవడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. అన్నింటికంటే ఎక్కువగా ముఖ సౌందర్యం కోసం తరచూ వినియోగించే కెమికల్ ఆధారిత బ్యూటీ ఉత్పత్తులు మరింత ప్రమాదకరం. వయస్సును ముందే పెంచేస్తాయివి. అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని హోమ్ రెమిడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే బెల్లంతో చర్మంపై ముడతల సమస్యను తొలగించవచ్చంటే ఆశ్చర్యంగా ఉందా..కానీ ఇది నిజం. బెల్లంతో ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలున్నాయి. శరీరం ఇమ్యూనిటీని పెంచుతుంది. బెల్లం తినడం వల్ల చర్మంలో ఏదో తెలియని నిగారింపు వస్తుంది. తక్కువ వయస్సుకే ఏర్పడే ముడతల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
బెల్లంలో చాలా రకాల పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్ పోషకాలు కావల్సినంత లభిస్తాయి. ఇందులో లభించే విటమిన్లు చర్మానికి నేచురల్ క్లీన్సర్‌గా పనిచేస్తాయి. బెల్లం క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం అంతర్గతంగా శుద్ధి అవుతుంది. గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని కూడా బెల్లం సేవించవచ్చు. ఏ రూపంలో ఎలా తీసుకున్నా ఫరవాలేదు.
ముఖంపై ఏర్పడే ముడతల సమస్య బాధిస్తుంటే బెల్లం అద్భుత పరిష్కారంగా కన్పిస్తుంది. ముఖంపై ముడతలు పోగొట్టుకోవాలంటే ఒక స్పూన్ బెల్లంలో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ద్రాక్ష రసం, ఒక స్పూన్ బ్లాక్ టీ, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని దాదాపు 15-20 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం 3-4 సార్లు చేస్తే మంచి ప్రయోజనాలు, ఫలితాలుంటాయి. యాంటీ ఏజియింగ్‌లా పనిచేసి ముఖంపై ముడతలు పోగొడుతుంది.
అంతేకాకుండా ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చల్ని తొలగించేందుకు కూడా బెల్లం అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక స్పూన్ బెల్లం పౌడర్ తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ టొమాటో రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై నల్ల మచ్చలన్నీ తొలగిపోతాయి.
Also read: Weight Loss Drinks: రోజూ పరగడుపున ఈ డ్రింక్స్ తీసుకుంటే, 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook