Heart Attack Risk: జిమ్ వెళ్తున్నా గుండెపోట్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఏం జాగ్రత్తలు పాటించాలి
Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. రోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంపై దృష్టి పెట్టేవారు కూడా గుండెపోటు సమస్య తలెత్తుతోంది. నిమిషాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అసలీ పరిస్థితి ఎందుకు ఎదురౌతోంది, తీసుకోవల్సిన జాగ్రత్తలేంటనేది పరిశీలిద్దాం..
Heart Attack Risk: గత కొద్దిరోజులుగా చాలామంది ప్రముఖులు గుండెపోటుతో హఠాన్మరం చెందుతున్నారు. అదే సమయంలో సామాన్యులు కూడా ఉన్నట్టుంది కుప్పకూలిపోతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ పరిస్థితికి కారణమేంటి, తీసుకోవల్సిన జాగ్రత్తలేమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్, బాలీవుడ్ సింగర్ కేకే, టీవీ నటుడు సిద్ధార్ధ శుక్లా, కామెడీ స్టార్ రాజు శ్రీవాత్సవ్, ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ఇలా చాలామంది ఉన్నట్టుండి గుండెపోటు కుప్పకూలి ప్రాణాలు వదిలినవారే. అందరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేవారే కావడం విశేషం. అంటే వర్కవుట్స్ కూడా గుండెపోటు ముప్పును తగ్గించవా, అసలేం జరుగుతోంది, ఎందుకీ పరిస్థితి..
వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెపోట్లు
పూర్తి ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉన్న వ్యక్తులకు గుండెపోటు ఎందుకొస్తుందనే ఆందోళన ఇటీవలి కాలంలో పెరుగుతోంది. వర్కవుట్స్ లేదా వ్యాయామం గుండెపోటు సమస్యను ముప్పు తగ్గించలేకపోతే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. అనారోగ్యకరమైన ఆహారం లేదా ఆయిలీ ఫుడ్ తీసుకోకపోయినా, క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్తున్నా ఈ సమస్య వస్తోంది.
మీరు వర్కవుట్స్ చేస్తున్నారా లేదా అనే విషయం ఒక్కటే గుండెపోటుపై ప్రభావం చూపించదు. మీరు చేసే వ్యాయామం ఎలా ఉందనేది కూడా చాలా ముఖ్యం. చాలామంది యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. అది కూడా కేవలం బాడీ షేప్స్ దృష్టిలో ఉంచుకుని హార్డ్‌గా వ్యాయామం చేస్తుంటారు. జిమ్‌లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. ఎప్పుడూ వ్యాయామం అనేది సాధారణ స్థాయిలో అంటే మితంగా ఉండాలి. పరిమితి దాటకూడదు. హెవీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి శరరీరం ఒక్కోలా స్పందిస్తుంటుంది. ప్రతి ఒక్కరిలో భారీ ఎక్సర్‌సైజ్‌లు తట్టుకునే సామర్ధ్యం ఉండదు.
వ్యాయామంలో ఏ అంశాలు గుర్తు పెట్టుకోవాలి
త్రెడ్ మిల్ లేదా ఏదైనా కార్డియో ఎక్సర్‌సైజ్ ఒకసారికి 10 నిమిషాల కంటే ఎక్కువ పొరపాటున కూడా చేయకూడదు.
ప్రతి కార్డియో ఎక్సర్‌సైజ్ తరువాత 2-5 నిమిషాలు విరామం అవసరం. దీనివల్ల గుండెకు కాస్త ప్రశాంతత లభిస్తుంది.
డాక్టర్ లేదా ట్రైనర్ సలహా మేరకు వర్కవుట్స్ సమయం నిర్ణయించుకోవాలి. అవసరానికి మించి వ్యాయామం మంచిది కాదు. సాధారణంగా 30 నిమిషాలు చాలని అంటారు.
ఛాతీ ఎడమభాగంలో ఏదైనా నొప్పిలా అన్పిస్తే వెంటనే వ్యాయామం ఆపేయాలి. వైద్యుడిని సంప్రదించాలి.
Also read: Dry Eyes Problem Solution: పొడి కళ్ల సమస్యలకు ఇలా 2 రోజుల్లో ఉపశమనం పొందవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook