How To Protect Yourself From Heart Attack: ప్రస్తుతం చాలా పెద్ద సంఖ్యలో గుండె పోటు సమస్యల బారన పడుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ పెరిగి గుండెపోటుకు గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఇంతక ముందు వృద్ధులు ఇలాంటి సమస్యలను ఎదుర్కోనేవారు ప్రస్తుతం చిన్న వయస్సు వారు కూడా ఇలాంటి సమస్యల బారిన పడి చనిపోతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే గుండె పోటు సమస్యలను తగ్గించుకోవాడానికి తప్పకుండా తీసుకునే ఆహారాల్లో పలు రకాల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండెపోటును ఎలా నివారించాలి?:
1. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి:

గుండె పోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ ఆహారంలో తాజా పండ్లు, పచ్చి కాయగూరలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాలు, కొవ్వు ఉన్న చేపలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండె పోటు సమస్యలతో బాధపడేవారు నూనె, తీపి వస్తువులకు దూరంగా ఉండడం చాలా మంచిది.


2. ఫిజికల్ యాక్టివిటీస్ పెంచండి:
ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా  చాలా మంది ఆఫీసులో 8 నుండి 10 గంటల పాటు కూర్చొని పని చేస్తున్నారు. లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా శరీర శ్రమ కూడా తగ్గిపోయింది. అయితే గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామాలతో పాటు, యోగా కూడా చేయాల్సి ఉంటుంది.


3. ధూమపానానికి దూరంగా ఉండండి:
ధూమపానం చేయడం వల్ల చాలా మందిలో ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాంతకంగా మారొచ్చు. అయితే ధూమపానం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా గుండె సమస్యలున్నవారు దూమపానం చేయడం వల్ల  మరణానికి కూడా దారితీయోచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


4.  రక్తపోటు పెరుగుదలకు కారణం:
రక్తపోటు పెరుగుదల వల్ల చాలా మందిలో గుండెపోటు సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి గుండె పోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకునే పలు ఆహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Balakrishna Controversy:మాకేం వివాదం అనిపించలేదు.. ఇక లాగకండి.. ఎస్వీ రంగారావు మనవళ్లు వీడియో రిలీజ్!


Also Read: IPS Transfers: ఒకే దెబ్బకు తెలంగాణలో 91 మంది ఐపీఎస్‌ల బదిలీ.. అందుకేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook