Heat rash remedy: భారతీయలు పురాతన కాలం అనారోగ్య సమస్యలు వస్తే కేవలం ఆయుర్వేద మూలికలతో మాత్రమే చికిత్స చేసేవారు. దగ్గు, జలుబు వంటి వ్యాధుల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల దాకా అన్న సమస్యలకు పూర్వమే ఔషధాలను కనుగొన్నారు. పూర్వీకులు చర్మ సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందడారనికి చాలా రకాల చిట్కాలను వినియోగించారు. ప్రస్తుతం చర్మానికి సంబంధించిన చాలా రకాల ఉత్పత్తులు మార్కెట్‌లో ఉన్నాయి. కానీ ఇవి శరీరానికి ఊహించని దుష్ప్రభావాలను తెచ్చిపెడుతున్నాయి.  అటువంటి పరిస్థితిలో ఇంటి నివారణలను అనుసరించాల్సి అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి చర్మానికి రక్షణ కలిపిస్తాయి:


కలబంద (Aloe vera) :


కలబందలో యాంటీ యాక్నే, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. కావున ఇవి శరీరాన్ని చలువ చేసేందుకు కృషి చేస్తాయి. ప్రిక్లీ హీట్ సమస్య ఉంటే.. కలబందను ఉపయోగించవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. అలోవెరా జెల్‌ను ప్రిక్లీ ప్రదేశంలో అప్లై చేస్తే సమస్యలు తొలగిపోయే అవకాశాలున్నాయి.


చందనం (Sandalwood) :


చందనం చర్మ సౌందర్యం కోసం వివిధ రకాల ఉత్పత్తుల్లో వాడుతారు. ఇది చర్మానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను ఇస్తుంది. చందనం చర్మానికి సంబంధించిన అన్ని
సమస్యలను దూరం చేస్తుంది. రోజ్ వాటర్‌లో చందనం మిక్స్ చేసి ప్రిక్లీ హీట్‌కి అప్లై చేస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


ముల్తానీ మిట్టి (Sandalwood) :


ముల్తానీ ప్రస్తుతం చాలా మంది చర్మ సౌందర్యం కోసం వినియోగిస్తున్నారు. దీనిని మరో విధంగా ఎఫెక్టివ్ మెటీరియల్ అని కూడా అంటారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సమస్యల నుంచి పూర్తిగా సంరక్షిస్తాయి


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Male Fertility: పాలలో ఇది కలిపి తాగితే పురుషులలో స్పెర్మ్ కౌంట్ ఘనీయంగా పెరుగుతుంది..!


Also Read: Male Fertility: పెళ్లైన మగవారు పచ్చళ్లు తినడం మానుకోవాలి? లేకపోతే సంతానోత్పత్తిపై ప్రభావం తప్పదు..!



 


 


 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook