Herbal Drink For Weight Loss: చిన్నతనంలో ఏదైనా గాయం తగిలినప్పుడు వంట గదిలో ఉండే వస్తువులతో గాయాలను మానిపించేవారు. అంతేకాకుండా వంటింట ఉండే చాలా రకాల మసాల దినుసులు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశనం కలిగిస్తాయి. ఏలకులు, మెంతులు, జీలకర్రలో ఔషధ గుణాలు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా నీటిలో ఉడికించి తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రయాపడుతున్నారు. అంతేకాకుండా ఈ డ్రింక్‌ను బరువు తగ్గడానికి కూడా వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలి:
ఒక కప్పులో నీటి పోసి ఒక చెంచా సోపు, జీలకర్రతో పాటు ఏలకులను నానబెట్టాలి. ఇప్పుడు ఈ నీటిని ఉదయం మరిగించి.. దానిలో నానబెట్టిన బెల్లం లేదా తేనె కలిపి తాగాలి.


బరువు తగ్గుతారు:
ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఈ డ్రింక్‌ ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా దీని బాడీలో కేలరీలు కూడా వేగంగా కరిగిపోతాయి. కాబట్టి ఈ డ్రింక్‌ను ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది.


రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ఈ సుగంధ ద్రవ్యాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధిక మొత్తంలో లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన డ్రింక్‌ను ప్రతి రోజూ తాగితే.. రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ హెర్బల్ డ్రింక్ తాగడం వల్ల జలుబు, దగ్గు, వైరల్ జ్వరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.


జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
జీలకర్ర, సోపు రెండూ జీర్ణక్రియ శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, వికారం వంటి సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి. దీంతో అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.


వాపు, నొప్పిల నుంచి ఉపశమనం:
ఈ డ్రింక్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది వాపు, నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతాయి. అంతేకాకుండా ఈ డ్రింక్‌ను ప్రతి రోజూ తీసుకుంటే కీళ్ళు, కండరాల నొప్పి, వాపుల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


 


Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ


Also Read : Vishnu Vishal Ravi Teja : కథ ఇవ్వమని రవితేజ అడిగినా నో అని చెప్పా : విష్ణు విశాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook