Vishnu Vishal Ravi Teja : కథ ఇవ్వమని రవితేజ అడిగినా నో అని చెప్పా : విష్ణు విశాల్

Vishnu Vishal No to Ravi teja విష్ణు విశాల్ సినిమాలను తెలుగు రవితేజ రిలీజ్ చేస్తోన్న సంగతె తెలిసిందే. ఆర్ టీ టీం వర్క్స్ పేరిట తెలుగులోకి విష్ణు విశాల్ సినిమాలను డబ్ చేస్తున్నాడు రవితేజ. ఇప్పుడు కూడా ఓ కొత్త సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నాడు రవితేజ.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 07:11 PM IST
  • మట్టి కుస్తీ ప్రమోషన్స్‌లో బిజీగా విష్ణు విశాల్
  • రవితేజ మెచ్చిన కథే మట్టి కుస్తీ
  • రవితేజకు కూడా కథ ఇవ్వనన్న హీరో
Vishnu Vishal Ravi Teja : కథ ఇవ్వమని రవితేజ అడిగినా నో అని చెప్పా : విష్ణు విశాల్

Vishnu Vishal Says No to Ravi teja : విష్ణు విశాల్ సినిమాలను తెలుగులోకి రవితేజ తీసుకొస్తున్నాడు. ఈఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిన సంగతి తెలిసిందే. విష్ణు విశాల్ నటించిన FIR సినిమాను తెలుగులో రవితేజ తన ఆర్ టీ బ్యానర్ మీద రిలీజ్ చేశాడు. ఈ చిత్రం బాగానే ఆడింది. రవితేజకు ప్రాఫిటబుల్ ప్రాజెక్టుగానే ఉపయోగపడింది. ఇప్పుడు విష్ణు విశాల్ మట్టి కుస్తీ అనే సినిమాతో రాబోతోన్నాడు. ఈ చిత్రాన్ని కూడా రవితేజ తెలుగులో సమర్పిస్తున్నాడు. 

తాను తీసే సినిమాలన్నింటిని తెలుగులో రిలీజ్ చేస్తానని, ప్రొడక్షన్‌లోనూ సహకరిస్తాను అని రవితేజ భరోసా ఇచ్చాడట. ఈ మేరకు తనను నమ్మిన రవితేజకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అన్నాడు విష్ణు విశాల్. కోలీవుడ్‌లో ఎంతో మంది తన బడ్జెట్, స్టామినా ఇంతే అంటూ లెక్కలు వేశారని, కానీ రవితేజ మాత్రం కలిసిన మొదటి మీటింగ్‌లోనే ఎంతో భరోసా ఇచ్చాడని విష్ణు విశాల్ చెప్పుకొచ్చాడు.

మట్టి కుస్తీ కథను కూడా ముందు ఆయనకు వినిపించానని, డైరెక్టర్ సపరేట్‌గా నెరేషన్ ఇచ్చాడని విష్ణు విశాల్ తెలిపాడు. అంతా అయ్యాక కథ బాగా నచ్చడంతో తెలుగులో తాను చేస్తానని రవితేజ అన్నాడట. కానీ తాను మాత్రం నో అని చెప్పినట్టు విష్ణు విశాల్ అన్నాడట. తమిళం, తెలుగులో తానే చేస్తానని విష్ణు విశాల్ చెప్పాడట. మీరు కేవలం నిర్మాతగా మాత్రమే ఉండండని కోరాడట విష్ణు విశాల్. తెలుగులో తాను కూడా క్రేజ్ తెచ్చుకోవాలని అనుకున్నట్టుగా విష్ణు విశాల్ చెప్పి కన్విన్స్ చేశాడట.

ఒక వేళ మట్టి కుస్తీ అనే చిత్రం రవితేజ చేసి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేదని, ఆయన కామెడీ టైమింగ్‌కు ఈ కథ బాగా సెట్ అవుతుందని విష్ణు విశాల్ అన్నాడు. మొత్తానికి మట్టి కుస్తీ కథ మీద రవితేజ మనసు పడ్డాడని అర్థమవుతోంది. మరి ఈ చిత్రం విష్ణు విశాల్‌కు ప్లస్ అవుతుందా? లేదా?అన్నది చూడాలి.

Also Read : Love Today Day 1 Collections : అల్లరి నరేష్‌ను తొక్కి అవతల పారేసిన తమిళ డబ్బింగ్ సినిమా.. లవ్ టుడేకు దిమ్మ తిరిగే కలెక్షన్లు

Also Read : Bigg Boss Elimination : బిగ్ బాస్ ఎలిమినేషన్.. పాపం ఫైమా.. ఇరుకున పెట్టేస్తారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News