Parenting Tips : మీరు చెప్పినమాట మీ పిల్లలు అస్సలు వినట్లేదా.. అయితే ఇలా చేసిచూడండి
Children tips:పిల్లలు అంటేనే చెప్పిన మాట వినని వారు అని ఈ రోజుల్లో పేరెంట్స్ కొత్త అర్థం కనిపెడుతున్నారు. ఇందులో వాళ్ల తప్ప ఏమీ లేదు.. పిల్లలు కూడా అలాగే మొండిగా ప్రవర్తిస్తున్నారు. మరి దీని వెనుక కారణాలు ఏమిటి? పరిష్కారం ఎలా?తెలుసుకుందామా..
Parenting Tips : పిల్లలు ఒక్కొక్కసారి పేరెంట్స్ చెప్పిన మాట అస్సలు వినరు. తినడం దగ్గర నుంచి చదువుకోవడం వరకు.. ఆడుకోవడం దగ్గర నుంచి పడుకోవడం వరకు.. చాలా విషయాల్లో ఎప్పుడూ మారం చేస్తూ ఉంటారు. మొండిగా ప్రవర్తించే పిల్లలను కంట్రోల్ చేయడానికి పేరెంట్స్ కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ అలా చేయడం వల్ల పిల్లలు మాట వినరు సరి కదా మరింత మొండిగా తయారవుతారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా..
చాలా సందర్భాల్లో పిల్లలు తాము చెప్పిందే చేస్తామని మారాం చేస్తారు. మరి ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి మొండి మనస్తత్వం ఉన్న పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది. ఇటీవల కాలంలో చాలా వరకు కుటుంబాలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా అయిపోయాయి. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లడం.. ఇంట్లో శ్రద్ధ చూపేవారు లేకపోవడం.. ఎక్కువ స్క్రీన్ టైమ్ పిల్లలకి అలవాటు కావడం.. పిల్లలలో ఇలాంటి బిహేవియర్ కు ముఖ్య కారణాలు.
పిల్లలు సునీతమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వాళ్లు ఏది నేర్చుకున్న ఇంట్లో తల్లిదండ్రులను చూసి.. తమ చుట్టూ ఉన్న వాతావరణం చూసి నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు తమ ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాం ?ఎలా ప్రవర్తిస్తున్నాం ?అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మరీ ముఖ్యంగా పిల్లల సమక్షంలో ఉన్నప్పుడు. అంతేకాదు టీవీలో పిల్లలు ఎటువంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారు అన్న విషయంపై కూడా తల్లిదండ్రులకు పూర్తి అవగాహన ఉండాలి. కొన్ని రకాల షోలు చిన్న పిల్లల మనస్తత్వం పై ఘాడమైన ప్రభావాన్ని చూపిస్తాయి అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడడం ఎంతో ముఖ్యం. వాళ్లు చెప్పేది పూర్తయ్యేంతవరకు మనం ఓపికగా వినాలి.. అంతేకానీ వాళ్లు చెప్పే ప్రతి విషయాన్ని కరెక్ట్ చేస్తూ పోతే కొన్ని రోజులకు పిల్లలు తమ మనసులో ఉన్న భావాలను ఎక్స్ప్రెస్ చేయడం మానేస్తారు. ఇది పిల్లల్లో తెలియకుండా చిన్నతనం నుంచే డిప్రెషన్ కి దారితీస్తుంది. వాళ్లు స్కూల్లో ఏం జరిగింది .. ఫ్రెండ్స్ తో ఎటువంటి ఆటలు ఆడుకున్నారు.. హోంవర్క్ ఎలా చేశారు.. ఇవన్నీ కనుక్కోవడానికి గట్టిగా పది నిమిషాల సమయం కూడా పట్టదు. ఆ కాస్త ఓపిక తల్లిదండ్రులు చూపించగలిగితే పిల్లల ప్రవర్తనలో ఈ మొండితనం సులువుగా పోతుంది. అందుకే పేరెంట్స్ ఇటువంటి సున్నితమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని పిల్లలతో సన్నిహితంగా మెలగాలి.. అప్పుడే మీ ఇంట్లో ఒక హెల్తీ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter