Health Benefits of Walking after taking food: ప్రస్తుత జీవన విధానం ఉరుకులు పరుగులుగా మారింది. ఉద్యోగం, వ్యాపారం బిజీలో పడి ఆరోగ్యంను నిర్లక్ష్యం చేస్తున్నారు. తీరికలేని కారణంగా ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి. భోజనం చేసిన వెంటనే మధ్యాహ్నం అయితే పనిలో నిమగ్నమవుతన్నారు. అదే రాత్రి అయితే వెంటనే నిద్రపోతున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరం. తిన్న వెంటనే కాసేపు నడవాలని పెద్దలు చెప్పేదే.. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు  ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి ప్రధాన పాత్ర పోషించేవి పొట్టలోని చిన్న పేగులు. ఆహారంలోని పోషకాలను గ్రహించి శక్తిగా మార్చి శరీరానికి అందిస్థాయి. భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నడిస్తే తిన్న తర్వాత ఆహారం చిన్న పెగులలోకి వెళుతుంది. దాంతో త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఆహారం తిన్న తర్వాత నడిచినట్లయితే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించవచ్చు.


శరీరంలోని అధిక కొవ్వు లేదా స్థూలకాయంతో ఇబ్బంది పడే వారు ఆహారం తిన్న తర్వాత అరగంట లేదా ఒక గంట నడిస్తే.. పొట్టతో పాటుగా కొవ్వును తగ్గించుకోవచ్చు. నిద్రలేమి సమస్య ఉన్నవారు తిన్న తర్వాత వాకింగ్ చేస్తే.. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తిన్న తర్వాత వాకింగ్ చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అంతేకాదు జీవక్రియ మెరుగుపడుతుంది. 


ఆహారం తిన్న తర్వాత వాకింగ్ చేస్తే మలబద్ధకం కూడా తగ్గుతుంది. అంతేకాదు శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. కడుపులో మంట సహా ఇతర కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత కాస్త నడిస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఆహరం తిన్న తర్వాత 10 నిముషాలు నడిస్తే.. బరువు కూడా తాగొచ్చు.


Also Read: Yuzvendra Chahal: అది ఎలా వైడ్ అవుద్ది.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన యుజ్వేంద్ర చహల్ (వీడియో)


Also Read: Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook