తయారీకి కావలసిన పదార్థాలు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బియ్యం - పావుకిలో, పాలకూర -  నాలుగు లేదా ఐదు కట్టలు, యాలకులు - రెండు, లవంగాలు - మూడు, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, జీలకర్ర - పావు టీస్పూన్, పచ్చిమిర్చి- నాలుగు, ఉల్లిపాయ - ఒకటి (పెద్దది), అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్, బంగాళాదుంప - ఒకటి, గరం మసాలా: 1/2 టీస్పూన్, పసుపు - 1/2 టీస్పూన్, ఉప్పు - తగినంత, నిమ్మరసం - టీ స్పూన్, నూనె - తాలింపుకు సరిపడా


పాలక్ రైస్ తయారీ విధానం


* అన్నం బాగా ఉడికించి చల్లార్చాలి. 


* పాలకూరను శుభ్రంగా కడిగి, వేడినీళ్లల్లో ముంచి బయటకు తీసి మిక్సీ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 


* ఇప్పుడు బాణలిని స్టవ్ మంట మీద పెట్టి నూనె పోయాలి. నూనె వేగాక మాసాల దినుసుల్ని వేసి వేయించాలి. తరువాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేగనివ్వాలి. 


* వేగాక, ఉల్లిపాయ ముక్కలు వేయించి.. బంగాళాదుంప ముక్కలు వేసి మగ్గనివ్వాలి. 


* ముక్కలు మెత్తగయ్యాక గరం మసాలా, ఉప్పు, పసుపు వేసి మిక్సీ జాడీలో ఉన్న పాలకూర గుజ్జు వేసి పచ్చివాస పోయేవరకు వేయించాలి. 


* చివరగా చల్లార్చి పక్కన పెట్టుకున్న అన్నం వేసి కలిపి దించాక నిమ్మరసం కలిపి వడ్డించాలి.