COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

High Fat Foods: కొంతమంది లావు అవుతారనే భయంతో కొవ్వు తగిన పరిమాణంలో ఉండే ఆహారాలను తినడం మానుకుంటారు. అంతేకాకుండా బిర్యానీలు, వేయించిన ఆహారాలు అస్సలు తినకుండా ఉంటారు. శరీరంలో విటమిన్లు జీర్ణం కావడానికి కొవ్వు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఉండే విటమిన్లు A, D, E, K కొలెస్ట్రాల్‌లో మాత్రమే కరుగుతాయి. కాబట్టి శరీరానికి తగిన పరిమాణంలో మంచి కొలెస్ట్రాల్‌ ఎంతో అవసరం. కాబట్టి తప్పనిసరిగా కొవ్వు ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి తగిన పరిమాణంలో కొవ్వు లభించాలంటే ఎలాంటి ఆహారాలు తినాలో తెలుసా?..ఇంట్లో లభించే కొన్ని ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి పుష్కలంగా కొవ్వు లభిస్తుంది.


ఈ హై ఫ్యాట్ ఫుడ్స్‌ను తప్పకుండా తీసుకోండి:
అవోకాడో:

మీరు ఆరోగ్యం పట్ల చాలా కాన్షియస్‌గా ఉండి..అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే తప్పకుండా ఈ అవకాడోను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.  


ఆలివ్ ఆయిల్:
వేయించిన ఆహారాలకు దూరంగా ఉండేవారు తప్పకుండా ఆహారాల్లో ఆలివ్ ఆయిల్‌ను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు, మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


కొవ్వు ఉండే పెరుగు:
బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే శరీరంలోని కొవ్వును సమతుల్యంగా చేస్తుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా కొవ్వు పాలతో చేసిన పెరుగు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ప్రేగును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 


కొబ్బరి:
కొబ్బరి లేదా కొబ్బరి నూనె తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే చాలా రకాల పోషక గుణాలు లభిస్తాయి. దీని కారణంగా శరవేగంగా ట్రైగ్లిజరైడ్ ఫుడ్ సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook