Jaggery Water & Apple Cider Vinegar for Stomach Pain: ఆధునిక జీవనశైలిని అనుసరించే వారిలో చాలా మంది జంక్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకుంటున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, మంట సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర జీర్ణక్రియ సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండడానికి  పిజ్జా, బర్గర్‌, చిప్స్‌ తినడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని తీసుకుంటే పొట్ట సమస్యలకు చెక్‌:


బెల్లం:
జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నల్ల బెల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇందలో అధిక పరిమాణంలో ఐరన్‌ లభిస్తుంది. బెల్లాన్ని పొడిలా తయారు చేసి నీటిలో కలుపుకుని తాగితే కడుపులో మంట, గ్యాస్, నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెసిపీని వినియోగించాల్సి ఉంటుంది.


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


యాపిల్ సైడర్ వెనిగర్:
ఒక గ్లాసు నీటిలో మూడు చెంచాల యాపిల్ వెనిగర్, రెండు మూడు చుక్కల తేనె కలుపుని తాగడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల పొట్టలో యాసిడ్‌ పరిమాణాలను కూడా పెంచుతుంది. దీంతో సులభంగా ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా ఇలా ప్రతి రోజు ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీర బరువును కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 


కలబంద రసం:
కలబంద రసం గుండెల్లో మంట, మలబద్ధకం, వాంతులు, జీర్ణ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ రసంలో విటమిన్ బి, సి, ఇ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, కాపర్, సోడియం, సెలీనియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల  ప్రేగులలో నీటి స్థాయిని పెంచేందుకు సహాయపడుతుంది. 


Also Read: Hypertension: అధిక రక్తపోటును తగ్గించే ఆయుర్వేద గుణాలు కలిగిన రసం ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి