Home Remedy for Thick Hair: జుట్టును సహజంగా మందంగా మార్చి పొడుగ్గా చేసే వంటింటి రెమిడి ఉందంటే మీరు నమ్ముతారా? ఇది సహజసిద్ధంగా జుట్టుని పెంచడం కాకుండా మందంగా కనిపించేలా చేస్తుంది. ఆ వంటింటి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎగ్ మాస్క్..
గుడ్డులో ప్రోటీన్లు మన జుట్టుకు కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టును బాగా బీట్ చేసి జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి ఓ 30 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో షాంపూ చేసుకుంటే బెటర్. దీన్ని కనీసం వారానికి ఒక్కసారైనా ప్రయత్నించండి.


ఉల్లిపాయ రసం..
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది జుట్టు పెరుగుదలకు జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం తీసి వడకట్టుకొని జుట్టు అంతటికి ఒక 30 నిమిషాల పాటు పట్టించాలి ఆ తర్వాత షాంపుతో స్నానం చేసుకోవాలి. ఇది వారానికి రెండు సార్లు చేయండి.


కలబంద..
కలబందలో జుట్టును మృదువుగా చేసే గుణాలు ఉంటాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా చేస్తుంది కలబంద జెల్‌ తీసి జుట్టు అంతటికి అప్లై చేసి అరగంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇది వారానికి మూడుసార్లు ప్రయత్నించండి.


ఇదీ చదవండి: నల్లీ ఘోస్ట్‌ బిర్యానీ.. ఇలా రెస్టారెంట్‌ స్టైల్‌లో చేయండి నోరూరిపోతుంది..


కొబ్బరి నూనె..
కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి ఇది తరచుగా అప్లై జుట్టుకు అప్లై చేసుకుంటూ ఉండాలి బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది స్కాల్పుగా అవసరమైన పోషకాలు అమ్ముతాయి. కొబ్బరి నూనెతో జుట్టు అంతా మసాజ్ చేసుకొని ఒక గంట తర్వాత తల స్నానం చేసుకోవాలి.


గ్రీన్ టీ..
గ్రీన్ టీ లో జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు ఉంటాయి గ్రీన్ టీ తయారు చేసుకొని దాన్ని చల్లారపర్చాలి ఆ తర్వాత షాంపూలో కలుపుకొని తలస్నానం చేసుకోవాలి. లేదంటే గ్రీన్‌ టీ ని నేరుగా అప్లై చేసుకోవచ్చు కూడా. ఇది వారానికి రెండుసార్లు ప్రయత్నించండి.


ఇదీ చదవండి: గుడ్లు లేదా గింజలు.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఏవి బెస్ట్‌..?


జుట్టు పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా హెల్తీ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ డైట్ ఉంటేనే మంచి ఫలితాలు లభిస్తాయి.మీ శరీరానికి కావలసిన పోషకాలు మీ డైట్ లో చేసుకోవాల్సి ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter