Home Remedy In Acidity: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది ఎసిడిటీ సమస్య బారిన పడుతున్నారు. ఎక్కువ నూనె, మసాలా ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో ఎసిడిటీ కారణంగా కడుపులో ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు కూడా మొదలవుతాయి. ఈ సమస్యలు మొదలు కావడానికి ముందుగా ప్రతి రోజూ కడుపులో మంట, గ్యాస్, లూజ్ మోషన్ సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొందరిలో ఇలాంటి సమస్య వల్ల శరీరంలో పోషకాల కొరత కూడా ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల చిట్కాలను వినియోగించడం చాలా మేలు. ఆయుర్వేదంలో పేర్కొన్న ఔషధాల వల్ల కడుపులో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వీటి ద్వారా శరీరానికి కావాల్సి అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొన్నారు.


నిమ్మరసం ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుందా..?


>>నిమ్మరసం శరీరానికి  దివ్యౌషధంగా పని చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను బలపరుస్తుంది.  ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కావును దీనిని రోజూ తీసుకుంటే పొట్ట సమస్యలు దూరమవుతాయి.
>> బరువు తగ్గే క్రమంలో నిమ్మ రసం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర జీవక్రియను బలోపేతం చేస్తాయి. కాబట్టి బరువును నియంత్రించాలనుకునే వారు తప్పకుండా నిమ్మ రసాన్ని ట్రై చేయండి.
>> నిమ్మ రసం గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే నియాసిన్ థైమోల్ వంటి మూలకాలు గుండెను బలంగా ఉంచేందుకు సహాయపడతాయి.
>> నిమ్మ రసం కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. కావున క్రమం తప్పకుండా నిమ్మరసం తాగండి.


Also Read: Gold Price Today: రెండు రోజుల్లోనే భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే


Also Read: Shravana Shanivaram: ఇవాళ శ్రావణ మొదటి శనివారం.. ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కోసం 4 ముఖ్య పరిహారాలు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook