Homemade Skin Glow Serums: ముఖానికి గ్లో ఇచ్చే సీరమ్స్‌ ఎక్కువగా వినియోగిస్తున్నారు. మార్కెట్లో రకరకాల బ్రాండ్లు విక్రయిస్తున్నారు. అయితే, ఇంట్లో కూడా మనం డబ్బు ఖర్చు లేకుండా సీరమ్స్‌ తయారు చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లెమన్ సీరం..
నిమ్మకాయలో విటమిన్ సి గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని సహజసిద్ధంగా మెరిపించి స్కిన్ ని కాంతివంతం చేస్తుంది. ఈ లెమన్ సీరం తయారు చేయడానికి తాజా నిమ్మకాయ ఒకటి తీసుకొని అందులో రోజు వాటర్ నిమ్మరసం సమపాలలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ సీరానికి ముఖానికి అప్లై చేసుకుంటే మంచిది.


టర్మరిక్ సిరం..
టర్మరిక్ సిరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. గత దశాబ్దాలుగా పసుపును సౌందర్య సాధనాలు ఉపయోగిస్తున్నారు. ఈ టర్మరిక్ సిరం తయారు చేసుకోవడానికి పసుపు జోజోబా లేకపోతే కోకోనట్ ఆయిల్ సమపాళ్లలో తీసుకొని పేస్టు మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ మాస్కులా వేసుకొని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.


అలోవెరా సీరమ్‌..
అలోవేరాలో చర్మానికి పోషణ ఇచ్చి హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. ఇది స్కిన్ కేర్ లో కీలక పాత్ర పోషిస్తుంది. అలోవెరా సీరం తయారు చేసుకునే ముందు అలోవెరా నుంచి గుజ్జును తీసి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అలోవెరా లో బాదం నూనెను వేసి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని ఫ్రిజ్లో కూడా నిల్వ చేసుకోవచ్చు.


టమాటో జ్యూస్ మిల్క్ సీరం..
టమాటోల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన యాక్సిడెంట్లు ఉంటాయి. ఇది స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీంతో స్కిన్ యవ్వనంగా కనిపిస్తుంది. ఇక పచ్చి పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దీంట్లో ఎక్స్‌ఫోలీయేట్‌ గుణాలు ఉంటాయి. స్కిన్ పై ఉన్న డెడ్ సెల్స్ ని నిర్మూలించి ముఖానికి కాంతివంతం చేస్తుంది.ఈ సీరం తయారు చేయడానికి టమాటా జ్యూస్ లో పచ్చి పాలను సమపాళ్లలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇదొక కంటైనర్ లో వేసి నిల్వ చేసుకుని ఫింగర్ టిప్స్ తో నైట్ పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకొని పడుకోవాలి.


ఇదీ చదవండి: మామిడిపండు తీయ్యగా ఉన్నది ఇలా గుర్తించి కొనుగోలు చేయండి..


బంగాళదుంప ఆలివ్ ఆయిల్ సీరం..
బంగాళదుంప లో ఎంజాయ్ ఉంటాయి. ఇది స్కిన్ మెరిపించే గుణం ఉంటుంది ఈవెంట్ స్కిన్ టోన్ కూడా ఇస్తుంది. ఆలివ్ ఆయిల్ లో చర్మానికి పోషణనిచ్చే గుణం ఉంటుంది. ఇది స్కిన్ హైడ్రేషన్ గా ఉంచుతుంది బంగాళదుంప సిరం తయారు చేసుకోవడానికి బంగాళదుంప రసం తీసి అందులో ఆలివ్‌ ఆయిల్ వేసుకోవాలి. వీలైతే రోజుకు రెండుసార్లు దీన్ని ముఖానికి అప్లై చేసుకుంటే మంచి మెరుపు వస్తుంది


గ్రీన్ టీ సీరమ్..
గ్రీన్ టీ లో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని కేటాచిన్స్ అంటారు. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య నుండి కాపాడుతుంది. ముందుగా ఒకకప్పు గ్రీన్ టీ ని తయారు చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి ఇందులో అలోవెరా లేదా గ్లిజరిన్ కలిపి తయారు చేసుకోవాలి. దీన్ని ఓ కంటైనర్లో వేసుకొని ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.


ఇదీ చదవండి: వెల్లుల్లితో వారంలో 3 కిలోలు ఈజీగా తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా?


హనీ లెమన్ సీరమ్..
తేనె లెమన్ సీరమ్ తయారు చేసుకునే ముందు లెమన్ జ్యూస్ ని తీసి అందులో సమపాళ్లలో తేనె వేసి కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేయాలి. దీన్ని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని 15 నిమిషాలు ముఖంపై అప్లై చేసుకొని గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ సీరమ్‌ ముఖానికి అప్లై చేసుకుంటే కాంతివంతం అవుతుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook