Fenugreek: మెంతుల నీటిని ఇలా తాగుతూ ఎంతోమంది బరువు తగ్గారు.. మీరూ ట్రై చేయండి..
Fenugreek Health Benefits: మెంతులు మన వంటగదిలో నిత్యం అందుబాటులో ఉంటాయి. భారతీయ వంటకాల్లో మెంతులది కీలక పాత్ర. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆయుర్వేదపరంగా అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. అయితే మెంతులతో బరువు ఎలా తగ్గాలో తెలుసుకుందాం..
Fenugreek Health Benefits: మెంతి గింజల్లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్స్, ప్రోటీన్, ఐరన్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెంతుల నీటిని తరచూ డైట్లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి... అందుకే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి మెంతులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మెంతులతో బరువు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు ఎందుకంటే కడుపునిండా అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది..
మెంతుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల జీర్ణ ఆరోగ్యానికి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రాణాంతక వ్యాధులు మీ దరిచేరకుండా చేస్తుంది. మెంతి గింజలను తీసుకోవడం వల్ల పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది.
రాత్రి నానబెట్టి ఉదయం మెంతి నీటిని తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
మెంతులు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని మనం వివిధ ఆహారాల్లో జత చేసుకుని తీసుకోవడం వల్ల ఎంత ఇన్‌ఫ్లమేషన్ గుణాలు కలిగి ఉంటుంది. దీంతో ఈ బరువు కూడా సులభంగా తగ్గుతారు. మెంతుల నీటిని తీసుకోవటం వల్ల కడుపు ఉదయం పరగడుపున తీసుకోవాలి. దీని ఆరోగ్యానికి మేలు చేస్తుంది రక్తంలో చక్కెర సాయిలను నియంత్రించి బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది..
మెంతి నీటినే కాదు పౌడర్ రూపంలో కూడా తీసుకోవచ్చు వీటిని స్మూతీల్లో ఆహారం పైన చల్లుకొని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది...మెంతులతో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వంటి వాటిలో మెంతులు వేసుకోవటం వల్ల ఇందులో క్యారీలరీలు తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉంటుంది కాబట్టి సులభంగా తగ్గుతారు..
ఇదీ చదవండి: Red Fruits: ఈ 5 ఎర్రని పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు.. గుండె జబ్బుల జాడే ఉండదు...
మెంతులతో టీ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు... మెంతులను మరగకాచి తేనె కలిపి ఈ మెంతిని తీసుకోవాలి.. ఇందులో కావాలంటే మీరు నిమ్మరసం కూడా కలుపుకొని తీసుకోవచ్చు... మెంతులను, దాల్చిన చెక్క పొడి వేసుకుని తీసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.. ఈ రెండు కలిపి తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది గోరువెచ్చని మెంతిలో ఓట్ మీలో కూడా వేసుకొని తీసుకోవచ్చు..
మెంతులను ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది.జుట్టు ఊడిపోయే సమస్య ఉన్నవారు మెంతులు తీసుకోవాలి. వీటిని తరచూ వాడటం వల్ల మీ జుట్టు సహజసిద్ధంగా ఆరోగ్యంగా మెరుస్తుంది. అంతేకాదు జుట్టు ఎంత లాగినా ఊడనే ఊడదు.. పెరుగులో మెంతులు వేసి నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి జుట్టుకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఇదీ చదవండి: Okra water: బెండకాయ నీటితో జుట్టు ఇలా కడిగితే ఎంత లాగినా ఊడదంటే నమ్మండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter