Okra water Benefits For Hair: అవును బెండకాయను మన హెయిర్ కేర్ రొటీన్లు ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా అందంగా పెరుగుతుంది. అసలు బెండకాయ నీటితో డయాబెటిస్ వాళ్ళు తీసుకుంటే షుగర్ తగ్గిపోతుంది అని నిపుణులు చెబుతారు. కానీ హెయిర్ కేర్ రొటీన్ లో వాడటం వల్ల కూడా జుట్టు మందంగా అందంగా పెరుగుతుంది ఎంత లాగిన ఊడదు.
బెండకాయలో విటమిన్స్. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెండకాయ కట్ చేసి ఉడకబెట్టిన నీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏ, సి, కే కూడా ఉంటుంది. బెండకాయల జుట్టుకు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
బెండకాయ నీటిని కట్ చేసి ఉడకబెట్టి అవి జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉన్న విటమిన్స్, ఖనిజాలు జుట్టుకు అందుతాయి. దీంతో జుట్టు బలంగా పొడుగ్గా పెరుగుతుంది. హెయిర్ ఫాలికల్ డామేజ్ కాకుండా ఉంటుంది. కొత్త సెల్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాదు తలలో రక్తప్రసరణకు మెరుగు చేస్తుంది.
బెండకాయ నీటిని జుట్టు కడగటం వల్ల డ్యాండ్రఫ్ సమస్య త్వరగా తగ్గిపోతుంది. చుండ్రు సమస్యతో ఈ కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చలి కాలంలో డ్యాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది. తలలో దురద విపరీతంగా పెరిగిపోతుంది, దీనివల్ల ముఖంపై మచ్చలు కూడా ఏర్పడతాయి. మీ జుట్టులో డాండ్రఫ్ సమస్య తగ్గించుకోవాలంటే సహజసిద్ధంగా బెండకాయ నీటిని ఉపయోగించింది. దీంతో జుట్టు కడగటం వల్ల డ్యాండ్రఫ్ సమస్య త్వరగా తగ్గిపోతుంది దురద వంటివి కనిపించవు.
ఇదీ చదవండి: వావ్.. ఈ స్కీమ్‌లో రూ.12,000 పెట్టుబడి పెడితే రూ.34,1700 పొందే బంపర్ అవకాశం..
బెండకాయ నీటిని ఇలా తరచుగా మీ హెయిర్ కేర్ రొటీన్‌లో ఉపయోగించటం వల్ల జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పీహెచ్ సమతుల్యతకు ప్రేరేపిస్తుంది. జుట్టుపై దురద వంటి సమస్య ఉండదు అంతేకాదు ఇలా బెండకాయ నీటిని ఉపయోగించటం వల్ల జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది. దీంతో మీ జుట్టుకు సహజసిద్ధమైన మెరుపు సంతరించుకుంటుంది.
బెండకాయ నీటిని తయారు చేసుకునే విధానం..
కట్ చేసిన బెండకాయలు రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం పూట వాటిని బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత ఆ తర్వాత ఇది జెల్ లాగా మారుతుంది. అప్పుడు బెండకాయ ముక్కలను పక్కకు తీసేసి దీంతో జుట్టును కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత షాంపుతో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వారానుకో రెండు సార్లు చేశారంటే మీ జుట్టు ఆరోగ్యంగా దృఢంగా మందంగా పెరుగుతుంది. సహజసిద్దంగా మెరుపు సంతరించుకుంటుంది.
ఇదీ చదవండి: జియో, బీఎస్‌ఎన్‌ఎల్ 70 రోజుల వ్యాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టరో తెలుసా? ప్లాన్ ధరలు చెక్ చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter