Red Fruits: ఈ 5 ఎర్రని పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు.. గుండె జబ్బుల జాడే ఉండదు...

Red Fruits For Healthy Heart: ఎరుపు రంగులో వివిధ రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీ వంటి పండ్లు అధిక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అయితే ఎరుపు రంగు పండ్లు తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా, సేఫ్ గా ఉంటుంది... ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి... ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి 5 ఎరుపు రంగు పండ్ల జాబితా ఏంటో తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Nov 21, 2024, 07:20 PM IST
Red Fruits: ఈ 5 ఎర్రని పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు.. గుండె జబ్బుల జాడే ఉండదు...

Red Fruits For Healthy Heart:  మీ డైలీ వారి డైట్లో ఎరుపు రంగు పండ్లు ఏదో ఒకటి తినడం వల్ల మీకు ఎంతో ఆరోగ్య కరం. ఎందుకంటే అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ గుండె సేఫ్ గా ఉండాలంటే ఎరుపు రంగు పండ్లు తినాల్సిందే. మనకు ఎన్నో ఎరుపు రంగులో పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఐదు ఎరుపు రంగులో ఉండే పండ్ల జాబితా ఏంటో తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీలు..
స్ట్రాబెర్రీలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇందులో ఆంథోసైనిన్స్‌ ఉంటాయి. ఇది మంచి ఎరుపు రంగు కలర్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని డైట్ లో చేర్చుకుంటే బ్లడ్ ప్రెషర్, ఇన్‌ఫ్లమేషన్‌ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా ఈ స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగించటంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని స్నాక్ రూపంలో తీసుకోవాలి. లేకపోతే నేరుగా కూడా తింటే ఎంతో ఆరోగ్యం..

ఎర్ర క్యాప్సికం
ఎర్ర క్యాప్సికం గురించి అందరికీ తెలిసిన విషయమే, దీంతో రుచి అదిరిపోతుంది. అంతేకాదు ఔషధ గుణాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంచుతుంది ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అంతేకాదు ఎర్ర క్యాప్సికంలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఉండే ఖనిజాలు మన శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎర్ర క్యాప్సికం లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలకు చెక్‌ పెడుతుంది వీటిని సలహాలు తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: Okra water: బెండకాయ నీటితో జుట్టు ఇలా కడిగితే ఎంత లాగినా ఊడదంటే నమ్మండి..

టమోటాలు..
టమాటాలు మన ఇంట్లో నిత్యం అందుబాటులో ఉంటాయి. వీటితో రకరకాల కూరలు తయారు చేసుకుంటాం. టమాటలను డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండా సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఖనిజాలు లైకోపీన్‌ ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రా స్థాయిలను తగ్గించేస్తాయి. ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. టమాటాలు మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా ఉండాలి. వీటిని సలాడ్, కూర రూపంలో తీసుకోవచ్చు మన చర్మ ఆరోగ్యానికి కూడా టమాటాలు ఎంతో మేలు చేస్తుంది.

చెర్రీ పండ్లు...
చెర్రీ పండ్లలో కూడా అంటే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆంథోనీ సైన్స్ ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. గుండె సమస్యలు రాకుండా సేఫ్ ఉంచుతుంది. ఫ్రెష్ చెర్రీలు లేదా డ్రై రూపం లో తీసుకోవాలి చెర్రీ జ్యూస్ కూడా తీసుకోవచ్చు.

ఇదీ చదవండి:  వావ్‌.. ఈ స్కీమ్‌లో రూ.12,000 పెట్టుబడి పెడితే రూ.34,1700 పొందే బంపర్‌ అవకాశం..

దానిమ్మ జ్యూస్..
దానిమ్మ పండ్లు మార్కెట్లో విపరీతంగా కనిపిస్తాయి. ఇందులో పాలీఫెనల్స్‌  ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం దానిమ్మ జ్యూస్ తరచుగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది. దానిమ్మ గింజలు కూడా నేరుగా తినవచ్చు గుండె సమస్యలకు కాపాడుతుంది. వీటిని చాలా జ్యూస్‌ లేదా నేరుగా కూడా తీసుకోవచ్చు. గుండె సమస్యలు రాకుండా దానిమ్మ నివారిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News