How To Care Skin: 65 ఏళ్ల వృద్ధాప్య చర్మం కూడా ఇలా చేస్తే 7 రోజుల్లో యవ్వనంగా మారుతుంది.!
How To Care Skin: వృద్ధాప్య చర్మం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ యాపిల్ ఫేస్ మాస్క్ వినియోగించడం వల్ల కేవలం 7 రోజుల్లో యవ్వనంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Care Skin: ప్రస్తుతం చాలా మంది వివిధ కారణాల వల్ల స్కిన్ ఎలర్జీ ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. అయితే యంగ్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా మార్కెట్‌లో లభించే యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు కూడా వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరికొందరైతే ఖరీదైన చికిత్సలు కూడా చేయించుకుంటున్నారు. అయితే అందమైన చర్మం పొందడానికి ఖరీదైన చికిత్సలు చేయించుకోనవసరం లేకుండా కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
యంగ్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ పొందడానికి నిపుణులు సూచించిన యాపిల్‌తో తయారు చేసిన ఫేస్ మాస్క్‌ని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా మొటిమల సమస్య నుంచి కూడా సులభంగా రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్య చర్మ సమస్యలతో బాధపడేవారు యవ్వనంగా కనిపించేందుకు సహాయపడతాయి. అయితే ఈ యాపిల్ ఫేస్ మాస్క్‌ను తయారు చేసే పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం..
యాపిల్ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
యాపిల్ ముక్కలు
1 చెంచా తేనె
1 చెంచా పాలు
యాపిల్ ఫేస్ మాస్క్ తయారి పద్దతి:
ఆపిల్ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి యాపిల్‌ను ముక్కలుగా కట్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఈ ముక్కలను ఒక బాణలిలో నీళ్ళు పోసి మెత్తబడే వరకు మరిగించాలి.
ఈ ఉడికించిన యాపిల్ ముక్కలను కొద్ది సేపు చల్లారనివ్వాలి.
అందులో 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ పాలు వేయాలి.
తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.
అంతే సులభంగా యాపిల్ ఫేస్ మాస్క్ తయారవుతుంది.
యాపిల్ ఫేస్ మాస్క్ ఎలా ఉపయోగించాలో తెలుసా?:
యాపిల్ ఫేస్ మాస్క్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ముఖానికి మాస్క్‌ని బాగా అప్లై చేయాలి.
సుమారు 20 నిమిషాలు ముఖంపై ఉంచాలి.
తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..
Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook