Best Rice For Diabetes Patient: భారతదేశంలో అందరూ రోజువారీ ఆహారంలో రైస్‌ను ఆహారంలో తీసుకుంటారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల ప్రజలు వివిధ పేర్లతో బిర్యానీ, పులావ్, ఖిచ్డీ లేదా దాల్-రైస్ అని పిలుస్తారు. అయితే చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నవారు తెలిసి, తెలియక వైట్‌ రైస్‌ను తింటున్నారు. తెల్ల బియ్యాన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైట్ రైస్‌లో ఎక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కార్బోహైడ్రేట్ల సమృద్ధిగా లభిస్తాయి. దీంతో మధుమేహంతో బాధపడుతున్నవారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహంతో బాధపడుతూ వైట్‌ రైస్‌ను తినేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. కానీ రీసెంట్‌గా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనంలో పేర్కొన్న జోహా బియ్యం తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మధుమేహంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. 


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


ఈ రైస్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జోహా రైస్ ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ కూడా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా మధుమేహం కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జోహా రైస్‌లోని న్యూట్రాస్యూటికల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. జోహా రైస్‌లోని న్యూట్రాస్యూటికల్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. జోహా రైస్‌లో ఉండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అనేక రసాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనితో ఆయిల్స్‌ను కూడా తయారు చేస్తారు. 


జోహా రైస్ ప్రాముఖ్యత:
జోహారైస్ బాస్మతి బియ్యాన్ని పోలి ఉంటుంది. ఈ రైస్‌కి ఇప్పటికే జీఐ ట్యాగ్ లభించింది. దీని సువాసన బాస్మతి బియ్యం లాగా ఉండదు. ఇందులో ప్రోటీన్స్‌ అధికంగా లభిస్తాయి. కాబట్టి ఈ రైస్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook