Get Rid Of Ants: ఇంట్లో చీమల బెడద ఎక్కువైందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని తరమలేకున్నారా? అయితే, మీకోసమే ఈ హోం రెమిడీస్. ఇంట్లో తరచూ కిచెన్లో లేకపోతే బయట నుంచి దారి చేసుకుని ఇంట్లో చీమలు వస్తాయి. ఇవి ఇంటి గోడలపై కూడా పారుతూ కనిపిస్తాయి. వాటిని చూడగానే మనకు ఏదోలా అనిపిస్తుంది. అందుకే ఇంట్లోని కొన్ని వస్తువులతో చీమలను సులభంగా పారదోలవచ్చు. అవేంటో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాల్సిన పదార్థాలు..
సుద్ద
నిమ్మతొక్క
మిరియాలు
ఉప్పు
స్ప్రే బాటిల్
వైట్ వెనిగర్
దాల్చినచెక్క 
లవంగాలు


నిమ్మకాయ..
మీ ఇంట్లోకి చీమలు ప్రవేశించే మార్గంలో నిమ్మకాయ పిండండి, పిండిన నిమ్మతొక్కలను చీమలు తిరిగే ప్రాంతంలో వేయండి. అంతేకాదు నిమ్మకాయను ఇంటిని తుడిచే నీటిలో నిమ్మరసం పిండాలి. ఎందుకంటే చీమలు నిమ్మరసం వాసనను నచ్చవు. ఎందుకంటే వీటి రుచి చేదుగా ఉంటుంది. అయితే, చక్కెరకు చీమలు ఆకర్షితం అవుతాయి. కిచెన్ శ్లాబ్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.


సుద్ద..
ఇంట్లోని చీమలను తరమడానికి సుద్ద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే సుద్దలో కాల్షియం కార్బొనేట్ ఉంటుంది.ఇది చీమలను తరిమేయడానికి సహాయపడుతుంది. సుద్ద ముక్క పొడిని చీమలు తరిమే ప్రాంతంలో చల్లాలి. చీములు ప్రవేశించే మార్గంలో సుద్దతో గీయాలి. దీంతో అక్కడి నుంచి చీమలు రావు.


మిరియాలు..
చీమలు మిరియాల ఘాటుకు పారిపోతాయి. చీమల ప్రవేశ మార్గంలో మిరియాల పొడిని చల్లుకోవాలి. నీళ్లు, మిరియాలు కలిపిన సొల్యూషన్ తయారు చేసుకోవాలి. మిరియాల ఘాటుగా చీమలు చనిపోవు కానీ, పారిపోతాయి. మిరియాలపొడిని అవి తిరిగే ప్రదేశంలో చల్లాలి. 


ఇదీ చదవండి:  దుస్తులపై హోలీ రంగు మరకలు తొలగించడం ఎలా? ఈ ఈజీ ట్రిక్ మీకోసం..


ఉప్పు..
చీమలు తిరిగే ప్రాంతంలో ఉప్పు చల్లుకోవాలి. ఇది అత్యంత తక్కువ ధరకే మనకు అందుబాటులో ఉంటుంది. దీనికి కేవలం సాధారణ ఉప్పు మాత్రమే ఉపయోగించాలి. రాళ్ల ఉప్పును ఉపయోగించకూడదు. మరిగే నీటిలో పిడికెడు ఉప్పు వేసి కలపాలి. దీన్ని స్ప్రే బాటిల్లో వేసుకుని స్ప్రే చేయాలి.


వెనిగర్..
చీమలు వెనిగర్ వాసనకు కూడా పారిపోతాయి.  నీళ్లు, వెనిగర్ రెండూ సమపాళ్లలో కలుపుకోవాలి. కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా షేక్ చేయాలి.  వీటి ఘాటు వాసనకు చీమలు చావవు కానీ, దూరంగా పారిపోతాయి. చీమలు తిరిగే ప్రాంతంలో వీటిని చల్లుకోవాలి.


ఇదీ చదవండి: పోషక విలువలున్న మటన్ పాయాను రుచికరంగా ఇలా తయారు చేసుకోండి..
దాల్చినచెక్క..
దాల్చిన, లవంగం పొడి రెండిటినీ కలిపి చీమలు తిరిగే ప్రదేశంలో చల్లాలి. వీటి ఘాటు వాసనకు చీమలు దూరంగా పారిపోతాయి. దాల్చిన చెక్క చీమలకు మంచి వికర్షకంగా పనిచేస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter