Remove Holi Color From Clothes: హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకున్నారు. వివిధ రకాల రంగులు గులాల్ చల్లుకుంటూ స్త్రీ పురుషులు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జరుపుకున్నారు. అయితే, మరుసటి రోజు దుస్తులపై రంగు మరకలను ఎలా వదిలించుకోవాలా? అని బాధపడతాం. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఈ హోలీ రంగులను వదలించుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందాం.
నిమ్మకాయ..
మనం చిన్నప్పుడు పాఠశాలల స్థాయి నుంచే తెలుసుకున్న విషయం ఇది. దుస్తులపై మొండి మరకలను నిమ్మకాయతో వదిలించుకోవచ్చు. మీ దుస్తులపై కడా రంగు మరకలు ఉంటే నిమ్మకాయ ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మకాయలో యాసిడిక్ గుణం కలిగి ఉంటుంది. రంగు పడిన దుస్తులపై నిమ్మకాయ రుద్దితే రంగు పోతుంది. ఇది కాకుండా ఇందులో కాస్త సోడా కలిపి కూడా వాడొచ్చు. ఓ బకెట్లో నిమ్మరసం, సోడా, బకెట్ సగం వరకు నీళ్లో పోయండి. ఇప్పుడు అందులో రంగు ఉన్న బట్టలను వేయండి. ఓ అరగంట పాటు అలాగే పెట్టండి. ఆ తర్వాత దుస్తులను శుభ్రం చేయాలి.
ఇదీ చదవండి: ధనియాల నీళ్లు రోజూ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గిపోతారు..!
వెనిగర్..
ఇక్కడ వెనిగర్ అంటే కేవలం వైట్ వెనిగర్ మాత్రమే వాడాలి. ఇది మన చాలా మంది ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. మీరు హోలీ ఆడినప్పుడు గులాల్ మీ దుస్తులపై పడి ఆ రంగు వదిలించుకోకపోతే దానికి వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి మీరు దుస్తులు నానబెట్టిన బకెట్లో 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయండి. ఓ అరగంట పాటు అలాగే పక్కన పెట్టండి. ఇప్పుడు రంగు పడిన ప్రదేశంలో చేయితో రుద్దుతూ శుభ్రం చేయాలి. వైట్ వెనిగర్ కూడా రంగులను సులభంగా వదిలించేలా చేస్తుంది.
ఇదీ చదవండి: పోషక విలువలున్న మటన్ పాయాను రుచికరంగా ఇలా తయారు చేసుకోండి..
టూత్ పేస్ట్..
మనం యూట్యూబుల్లో చూస్తూ ఉంటాం. ఏవైనా మొండి మరకలు పోకపోతే టూత్ పేస్ట్ తెల్లరంగులో ఉండేటిది వాడతారు. కొన్ని దియ హ్యాక్స్ లో ఇవి కనిపిస్తాయి. కానీ, నిజంగా కూడా మీ దుస్తులపై రంగులును తొలగిస్తుంది వైట్ టూత్ పేస్ట్. హోలీ రంగులు పడిన దుస్తులపై టూత్ పేస్ట్ అప్లై చేయండి. దీన్ని ఓ 15 నిమిషాలపాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చేతితో మెల్లిగా రుద్దుతూ వాష్ చేయండి. టూత్ పేస్ట్ కూడా మొండి మరకలను తొలగిస్తుంది. ఇలా మరోసారి ప్రయత్నించండి. అప్పుడు రంగులు త్వరగా వదిలిపోతాయి. కానీ, దుస్తులను ఈ హ్యాక్స్ ద్వారా వాష్ చేసిన తర్వాత ఎండలో మాత్రమే ఆరబెట్టండి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter