Mutton Paya Recipe: పోషక విలువలున్న మటన్ పాయాను రుచికరంగా ఇలా తయారు చేసుకోండి..

Mutton Paya Recipe: ఆదివారలు, ఎవైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు చాలామంది ఇళ్లలో చికెన్, మటన్ వండుకుంటారు. ఇందులో ఎన్నో రకాల వెరైటీలు ఉంటాయి. అయితే, వీటితో సంబంధం లేకుండా మనకు కావాల్సినప్పుడల్లా పోషకాలతో కూడిన రెసిపీలపై కూడా ఫోకస్ చేయాలి.

Written by - Renuka Godugu | Last Updated : Mar 26, 2024, 08:27 AM IST
Mutton Paya Recipe: పోషక విలువలున్న మటన్ పాయాను రుచికరంగా ఇలా తయారు చేసుకోండి..

Mutton Paya Recipe: ఆదివారలు, ఎవైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు చాలామంది ఇళ్లలో చికెన్, మటన్ వండుకుంటారు. ఇందులో ఎన్నో రకాల వెరైటీలు ఉంటాయి. అయితే, వీటితో సంబంధం లేకుండా మనకు కావాల్సినప్పుడల్లా పోషకాలతో కూడిన రెసిపీలపై కూడా ఫోకస్ చేయాలి. మటన్ పాయా సూప్ ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మోకళ్లు, బొక్కలు నొప్పులు, బలహీనంగా ఉన్నవారు మటన్ పాయా సూప్ తాగాలి అంటారు. ఈరోజు మనం ఈ మటన్ పాయా సూప్‌ను రుచికరంగా ఎలా తయారు చేసకోవాలి?. ఈ మటన్ పాయా సూప్ కు కుక్కర్ కచ్చితంగా కావాలి. ఇందులో అయితే, వండుకోవడం సులభం. ఈ సూప్ కు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..
మేక కాళ్లు- 4
ఉల్లిపాయ-4
పచ్చిమిర్చి -4
టమాట-2
కొబ్బరి తరుము- ఒక కప్పు
అల్లంవెల్లుల్లి-2 TBSP
పసుపు -1TBSP
ధనియాల పొడి-2TBSp
మిరియాల పొడి -2TBSP
నూనె- కావాల్సినంత.
యాలకులు-2
లవంగాలు -2
దాల్చిన చెక్క ఒకటి
కొత్తమిరా, పుదీనా ఒక్కోటి
ఉప్పు- రుచికి సరిపడా

ఇదీ చదవండి: విటమిన్ K శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.. ఏ పండ్లలో ఉంటుందో తెలుసా?

తయారు చేసుకునే విధానం..
ముందుగా కాల్చిన మేక కాళ్లను నల్లదనం పోయేవరకు బాగా కడగాలి. వీటిని ఓ కుక్కర్లోకి తీసుకుని అందులో ఉల్లిపాయ తరుగు, టమాట, అల్లంవెల్లుల్లి, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఆ తర్వాత కొబ్బరి పొడిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎండు కొబ్బరిని కూడా ఉపయోగించుకోవచ్చు.  కుక్కర్ విజిల్ గాలి పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత ఈ కొబ్బరి పేస్ట్‌ కూడా వేసి మరికొంత సమయం ఉడికించుకోవాలి. 

ఇదీ చదవండి:  మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తింటున్నారా? అయితే, ఈ వ్యాధులు మీకోసం ఎదురుచూస్తున్నాయి..

ఇప్పుడు మరో కడాయి తీసుకుని అందులో నూనె వేసి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించాలి. మిగిలిన కొన్ని ఉల్లిపాయలను కూడా వేసి ఎరుపురంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులోనే తరిగిన కొత్తమిర, పుదీనా వేసి ఓ రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కుక్కర్లో ఉడికించుకున్న మేక కాళ్లను నీటితో సహా పూర్తిగా వేసి కలుపుకోవాలి. అంతే ఓ రెండు నిమిషాలు అలాగే స్టవ్ పెట్టండి. రుచికరమైన పాయా రెడీ. దీన్ని అన్నం, చపాతీ, దోశలతో కూడా తినొచ్చు. ఆ నీటిని నేరుగా తాగేస్తారు కూడా.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News