How To Get Rid Of Pimples Acne: కాలుష్యం కారణంగా చాలా మందిలో చర్మ వ్యాధులు తల్లెత్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర తరమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలు ప్రస్తుతం యుక్త వయసులో వారు కూడా పడుతున్నారు. కాబట్టి తప్పకుండా వీరు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు విటమిన్ లోపమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వీటిని ఆహారంగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ లోపం వల్లే ఈ సమస్యలు:


విటమిన్ ఎ లోపం:
విటమిన్ ఎ లోపం ప్రభావం వల్ల ముఖంపై వివిధ సమస్యలు రావొచ్చు. దీని కారణంగా చాలా మందిలో కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడడం. వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ లోపం నుంచి విముక్తి పొందడానికి ఆప్రికాట్లు, వెన్న, పుచ్చకాయ, క్యారెట్లు, ఆకు కూరలను తీసుకుంటే ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.


విటమిన్ కె లోపం:
విటమిన్ కె లోపం వల్ల ముఖం నల్లగా మారే అవకాశాలున్నాయి. ఈ లోపం వల్ల చర్మం సహజమైన మెరుపు కూడా తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆకు కూరలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి క్యాబేజీ, కాలీఫ్లవర్లను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


విటమిన్ సి లోపం:
విటమిన్ సి శరీరంలోని గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మ సమస్యలను దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ముఖంపై గాయాలు వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా విటమిన్ సి అధికంగా ఉండే బంగాళాదుంప, నిమ్మ, ఉసిరి వంటి కూరగాయలను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.  


విటమిన్ B12 లోపం:
ప్రస్తుతం చాలా మంది తెల్లమచ్చలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ సమస్యలు రావడానికి ప్రధాన లోపం విటమిన్ బి12 అని చాలా మంది తెలిక వారు మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పాలు ఎక్కుగా తీసుకోవాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..


Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook