How To Get Rid Of Whiteheads In 2 Days: అందమైన ముఖాన్ని పొందడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మర్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనలతో కూడిన ప్రోడక్ట్స్‌ కూడా వినియోగిస్తున్నారు. అయితే చాలా మందిలో వాతావరణం కాలుష్యం కారణంగా వైట్‌హెడ్స్ మోటిమల సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు మృతకణాలు, సెబమ్ ఆయిల్ లేదా ధూళి పేరుకుపోయి రంధ్రాలలో మూసుకుపోయి  వైట్‌హెడ్స్ వంటి సమస్యలు వస్తున్నాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైట్ హెడ్స్ ఎందుకు వస్తాయస్తో తెలుసా?:
హెయిర్ ఫోలికల్స్‌లో సెబమ్ ఉత్పత్తి పెరగడం, సెల్ షెడ్డింగ్ వంటి అనేక కారణాల వల్ల వైట్ హెడ్స్ వచ్చే అవకాశాలున్నాయి. యుక్తవయసులో మొటిమలు సాధారణమయినప్పటికీ.. ఒక దశ వయసుల్లో ఇలాంటి సమస్యలే వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు వచ్చే వారిలో సెబమ్ చర్మంపై చేరకోకపోయిన.. రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో  వైట్‌హెడ్స్ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా తీవ్ర చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు వహించడం చాలా మంచిది..


ఇలా సులభంగా వైట్ హెడ్స్ వదిలించుకోవచ్చు.!
1. సాలిసిలిక్ యాసిడ్ :

బీటా-హైడ్రాక్సీ యాసిడ్ ఉన్న ఉత్పత్తులు వినియోగించడం వల్ల చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీంతో రంధ్రాలు శుభ్రంగా మారుతాయి.  సాలిసిలిక్ యాసిడ్ వైట్ హెడ్స్ వంటి తేలికపాటి మొటిమలకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మంలోకి చొచ్చుకొనిపోయి మృత చర్మ కణాలను తొలగిస్తుంది.


2. టీ ట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్ జుట్టు సమస్యలను తొలగించడమేకాకుండా చాలా రకాల చర్మ సమస్యలను కూడా తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు  వైట్ హెడ్స్ కు వ్యతిరేకంగా పోరాడి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ఉపయోగించడం వల్ల వ్యాధుల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.


3. స్టీమ్ :
వైట్ హెడ్స్ ను పోగొట్టుకోవడానికి స్టీమ్ అత్యంత సహజమైన రెమెడీలలో ఒకటి. ఇది మూసుకుపోయిన రంధ్రాలను అన్‌లాగ్ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వైట్ హెడ్స్ వంటి సమస్యలను దూరం చేయడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.


Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి 


 Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి