Food For Improve Eyesight: ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ పై ఎక్కువ పని చేసే వారిలో కళ్ళజోళ్ళు ధరించే వారే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే దాని నుంచి వచ్చి కాంతి సరాసరి కంటి పై పడి తీవ్ర సమస్యల బారిన పడుతున్నారు. కొందరైతే కంటిచూపు కూడా కోల్పోతున్నారు. అయితే కంటి చూపు సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే కాకుండా శరీరంలో పోషకాలు తగ్గడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కంటిచూపు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజువారి ఆహారంలో పలు రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు తగ్గుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యారెట్:
క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు కళ్లకు మేలు చేస్తాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి కంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు క్యారెట్ రసాన్ని తాగాల్సి ఉంటుంది.


ఉసిరి రసం:
ఉసిరిలో కూడా శరీరానికి కావలసిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. ఇందులో  విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కంటిచూపు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉసిరి రసాన్ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. 


పాలకూర:
కంటికి మేలు చేసే వాటిలో పాలకూర కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ ఏ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి కంటి సమస్యలతో బాధపడేవారు వీటితో తయారుచేసిన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా శరీరాన్ని రక్షిస్తాయి. 


డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు చేకూరుతాయి. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని బరువును తగ్గించడమే కాకుండా.. కంటి సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాబట్టి కంటి చూపు మందగించిన వారు డ్రైఫ్రూట్స్ను ప్రతిరోజు నీటిలో నానబెట్టుకుని తినాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు


ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook