How To Make Amla Candy: ఉసిరిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్, ఫోలేట్, యాంటీ-ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, ఐరన్, పిండి పదార్థాలు, ఒమేగా 3, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఉసిరి ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల  శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఉసిరి తినడం వల్ల జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని ప్రతి రోజూ శీతాకాలంలో తినడం వల్ల శరీరాన్ని సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అయితే చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. వీటిని స్వీట్లల చేసుకుని కూడా తినొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని ఎలా స్వీట్లల తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉసిరి మిఠాయి చేయడానికి కావలసిన పదార్థాలు:
>>జీలకర్ర 1.5 tsp
>>పొడి చక్కెర 1.5 tsp
>>ఉసిరి 2 కిలోల
>>చక్కెర 1.5 kg
>>చాట్ మసాలా 1.5 tsp


ఉసిరి మిఠాయి ఎలా తయారు చేయాలి?
ఉసిరికాయ మిఠాయి చేయడానికి.. ముందుగా ఉసిరికాయను కడిగి శుభ్రం చేయండి.
తర్వాత కుక్కర్‌లో వేసి 1 విజిల్‌ వేసే దాకా ఉడికించాలి.
దీని తర్వాత మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత దానిలో పంచదార చల్లి పొడి గుడ్డతో కప్పాలి.
దానిని కనీసం ఒకటి లేదా రెండు రోజులు గుడ్డతో కప్పి ఉంచండి.
అప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో ఆరబెట్టండి.
ఆ తర్వాత పైన పేర్కొన్న పదార్థాలను వేసి కలిపి మిఠాయిల్లా నిల్వ చేసుకొవచ్చు.


Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్


Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి