How To Make Hair Straightening Spray: ప్రస్తుతం చాలామంది తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే హెయిర్ స్టైల్ ని మార్చుతున్నారు. అవును హెయిర్ స్టైల్ ని మార్చడం వల్ల కూడా ముఖం అందంగా కనిపిస్తుంది. జుట్టు ఆకర్షణీయంగా కనిపించేందుకు తప్పకుండా బ్యూటీ పార్లర్ కి వెళ్లి హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకనుంచి బ్యూటీ పార్లర్ కి అక్కర్లేదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకోవచ్చని వారు అంటున్నారు. అయితే ఈ స్ట్రెయిటెనింగ్ ని ఎలా చేసుకోవాలో మేము ఇప్పుడు తెలపబోతున్నాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జుట్టును నిఠారుగా చేసేందుకు తేనె, పాల ప్రభావవంతంగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జుట్టును మృదువుగా చేయడమే కాకుండా జుట్టుకు పోషణను కూడా అందిస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి (How To Make Hair Straightening Spray) హోమ్‌మేడ్ హెయిర్ స్ట్రెయిటెనింగ్ స్ప్రేని తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం...


హెయిర్ స్ట్రెయిటెనింగ్ స్ప్రే చేయడానికి కావలసిన పదార్థాలు:
ఒక టేబుల్ స్పూన్ తేనె
మూడు టేబుల్ స్పూన్ల పాలు
ఒక చిన్న స్ప్రే బాటిల్
 
హెయిర్ స్ట్రెయిటెనింగ్ స్ప్రేని ఎలా తయారు చేయాలి? 
>>హెయిర్ స్ట్రెయిటెనింగ్ స్ప్రే ను తయారు చేయడానికి ముందుగా సిద్ధం చేసుకున్న  స్ప్రే బాటిల్ తీసుకోండి.
>>తర్వాత అందులో ఒక చెంచా తేనె, రెండు మూడు చెంచాల పాలు కలపండి.
>>తర్వాత బాటిల్ కు నూతన బిగించి మిక్స్ చేసుకోవాలి. అంతే సులువుగా స్ట్రెయిటెనింగ్ స్ప్రే సిద్ధమవుతుంది.


హెయిర్ స్ట్రెయిటెనింగ్ స్ప్రేని ఎలా ఉపయోగించాలి? 
హెయిర్ స్ట్రెయిటెనింగ్ స్ప్రే జుట్టుకు అప్లై చేసే ముందు నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.
తర్వాత టవల్తో జుట్టును బాగా తుడిచి నేచురల్ గా ఆరబెట్టాలి.
ఆ తర్వాత సిద్ధం చేసుకున్న స్ప్రే బాటిల్ తో జుట్టు మూలాల నుంచి స్ప్రే చేసుకుంటూ రావాలి. 
ఇలా చేసిన తర్వాత 20 నిమిషాలు ఆరబెట్టి తేలికపాటి షాంపూతో కడిగేయాలి.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


 


Also Read: Taraka Ratna Latest Photo From ICU: ఆసుపత్రిలో ఐసీయూ బెడ్‌పై తారకరత్న ఫోటో వైరల్!


Also Read: Taraka Ratna Latest Photo From ICU: ఆసుపత్రిలో ఐసీయూ బెడ్‌పై తారకరత్న ఫోటో వైరల్!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook