Sprouts Dosa Recipe: మొలకల దోశ ను తయారు చేసుకోవడం ఎలా ?
Sprouts Dosa Recipe: మొలకలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే మొలకెత్తిన గింజలను చాలా మంది నేరుగా తినడానికి ఇష్టపడకుండా ఉంటారు. మీరు ఈ మెలకలు మొలకల దోశ ప్రతిరోజూ తినడానికి ప్రయత్నించండి. మొలకల దోశ తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా అందుతాయి.
Sprouts Dosa Recipe: మొలకల దోశ తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం కూడా శరీరానికి అందుతాయి. ఈ మొలకలలో ఒమేగా -3 అధికంగా ఉంటుంది. కాబట్టి మొలకల దోశ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యగం షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు ఈ దోశను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే దీని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కువ సమయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు.
మొలకల దోశకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు పెసర బెల్లాలు
1/2 కప్పు ఉలవలు
1/4 కప్పు మెంతులు
2 టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి
1/2 టీస్పూన్ జీలకర్ర
1/4 టీస్పూన్ మిరియాలు
1/2 టీస్పూన్ ఉప్పు
నూనె
నీరు
మొలకల దోశ తయారీ విధానం:
పెసర బెల్లాలు, ఉలవలు , మెంతులను కడిగి రాత్రంత నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన వెంటనే నీటిని తీసివేసి మొలకలు పొడవడానికి తడి బట్టలో చుట్టి ఉంచుకోవాలి. మూడు రోజుల తర్వాత, మొలకలు బాగా పోటెత్తగా వచ్చిన తర్వాత,వాటిని ఉపయోగించండి. మొలకలొచ్చిన పెసర బెల్లాలు, ఉలవలు, మెంతులు, బియ్యప్పిండి, జీలకర్ర, మిరియాలలో ఉప్పు కలిపి మెత్తని పిండిగా రుబ్బుకోవాలి. పిండి చాలా గట్టిగా ఉంటే కొద్దిగా నీటిని జోడించండి. ఈ పిండిని ముపై నిమిషాలు నానబెట్టాలి.
నాన్-స్టిక్ తవా తీసుకొని మీడియం మంట మీద వేడి చేసుకోవాలి. కొద్దిగా నూనె పోసి పలుచని గుండ్రంగా దోశ పోసుకోవాలి. దోశ అంచుల చుట్టూ నూనె చల్లి, మూత పెట్టి ఉడికించండి. దోశ గోధుమ రంగులోకి మారిన తర్వాత మడత పెట్టి లేదా రోల్ చేసి సర్వ్ చేయండి. మీకు ఇష్టమైన చట్నీ మరియు సాంబార్‌తో ఆనందించండి. ఈ విధంగా దోశ చేసుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యా లాభాలను పొందవచ్చు. పెద్దలు, పిల్లలు దీని ఇష్టంగా తింటారు.
Also Read Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter