How to Make Orange Peel Face Pack: ఆరెంజ్ విటమిన్ సి, ఎ, బి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పండ్లను ప్రతి రోజు తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. ఈ పండ్లు శరీరానికే కాకుండా తీవ్ర చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరెంజ్ తొక్కలో ఉండే గుణాలు చర్మానికి  చాలా మేలు చేస్తాయి. దీనితో తయారు చేసిన ఫేస్‌ ఫ్యాక్‌ను వినియోగించడం వల్ల చర్మంపై మచ్చలు, ఇతర మురికి సులభంగా దూరమవుతుంది. కాబట్టి వేసవిలో చర్మతో బాధపడేవారు తప్పకుండా ఈ నారింజ తొక్కలతో తయారు చేసిన ఫేస్‌ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాడానికి కావాల్సిన పదార్థాలు:
ఆరెంజ్ ఫీల్‌ పౌడర్‌
గ్లిజరిన్
అలోవెరా జెల్


Also read: Herbal Plant: ఈ ఒక్క మొక్క చాలు కేన్సర్ సహా 5 ప్రాణాంతక వ్యాధులకు చెక్ చెప్పవచ్చు


తయారీ పద్ధతి:
ముందుగా నారింజ తొక్కలను ఎండబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత తొక్కలను మిక్సీలో వేసి బాగా గ్రైండ్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక చిన్న కప్పు తీసుకుని అందులో గ్లిజరిన్ వేయాలి. ఆ తర్వాత అలోవెరా జెల్ వేసి తగినంత ఆరెంజ్ పీల్‌తో తయారు చేసిన పొడిని కలపాల్సి ఉంటుంది. వీటిని బాగా మిక్స్‌ చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత 13 నిమిషాల పాటు పక్కన పెట్టి ముఖానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 


ముఖానికి ఇలా అప్లై చేయండి:
ముందుగా ఈ ఫేస్‌ ప్యాక్‌ను మూఖానికి అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫేస్‌ ప్యాక్‌ను అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి... చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే ముఖంపై నల్ల మచ్చలు దూరమవుతాయి. అంతేకాకుంగా చర్మంపై రంగు కూడా మారుతుంది.


Also read: Herbal Plant: ఈ ఒక్క మొక్క చాలు కేన్సర్ సహా 5 ప్రాణాంతక వ్యాధులకు చెక్ చెప్పవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


Health TipsHealth Care TipsSpices BenefitsHow to use spices in foods