Glowing skin: 10 నిమిషాల్లో బొప్పాయి ఫేస్ జెల్‌తో మృదువైన, మెరిసే చర్మం మీ సొంతం
How To Make Papaya Face Gel At Home: ముఖానికి బొప్పాయి ఫేస్ జెల్‌ని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా చర్మం మృదువుగా, మెరిసేలా తయారవుతుంది.
How To Make Papaya Face Gel At Home: ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే చర్మం కోరుకుంటారు. దీని కోసం చాలా మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. వీటిని వినియోగించినప్పటికీ కొద్ది సేపటి తర్వాత ముఖం అందహానంగా తయారవ్వడం ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి క్రమంలో తప్పకుండా చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రసాయనాలతో కూడిన ఫేస్ ప్రోడక్ట్స్ కాకుండా సాధరణంగా లభించే బొప్పాయి ఫేస్ జెల్‌లను వినియోగించాల్సి ఉంటుంది. బొప్పాయి పండులో ఉండే గుణాలు అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ జెల్‌ను వినియోగించడం వల్ల ముఖంపై చర్మం మృదువుగా, మెరిసేలా తయారవుతుంది. అయితే ఈ బొప్పాయి ఫేస్ జెల్‌ని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫేస్ జెల్‌ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
❃ రెండు టేబుల్ స్పూన్లు పాలు
❃ నాలుగు విటమిన్-ఇ క్యాప్సూల్స్
❃ రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె
❃ ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
బొప్పాయి ఫేస్ జెల్ తయారి విధానం:
❃ ఈ ఫేస్ జెల్‌ను తయారు చేయడానికి ముందుగా పండిన బొప్పాయిని తీసుకోవాల్సి ఉంటుంది.
❃ తర్వాత ఈ పండుపై పొట్ట తొలచి వేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
❃ ఇలా చేసిన తర్వాత ఈ ముక్కలను మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
❃ ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పాలు, నాలుగు విటమిన్-ఇ క్యాప్సూల్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
❃ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిన పదార్థాలు వేసుకుని బాగా కలుపుకోవాలి.
❃ ఆ తర్వాత ఓ గాజు పాత్రలో వేసుకుంటే బొప్పాయి ఫేస్ జెల్ సిద్ధమైనట్లే..
ఈ ఫేస్ జెల్ ఉపయోగించే విధానం:
❃ ఈ ఫేస్ జెల్ వినియోగించే ముందు మీ ముఖాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది.
❃ తర్వాత ముఖానికి జెల్ అప్లై చేయాల్సి ఉంటుంది.
❃ ఇలా అప్లై చేసిన తర్వాత తేలిక పాటు చేతులతో మసాజ్ చేయాలి.
❃ ఇలా జెల్‌ను అప్లై చేసిన తర్వాత బాగా ఆరనివ్వాలి.
❃ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి