Restaurant style Nalli Ghost Biryani recipe: సాధారణంగా మనం ఇంట్లో చికెన్ బిర్యానీ, మటన్‌, మటన్ బిర్యానీ రిసిపీలు తయారు చేసుకుంటాం. ఆదివారం వచ్చిందంటే చాలు. అందరి ఇళ్లలో బిర్యానీ, నాన్ వెజ్‌ వంటకాలతో అదరగొట్టేస్తారు. అయితే, కొన్ని రకాల కష్టమైన వంటలు ఇంట్లో చేసుకోవడం కష్టం అనుకుంటారు. ఆ జాబితాలో వచ్చేదే నల్లీ ఘోష్ట్‌ బిర్యానీ, దీని రుచి అద్బుతంగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. వేడివేడిగా పొగలు కక్కే నల్లీ ఘోష్ట్‌ బిర్యానీని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఆస్వాదించాలనుకుంటున్నారా? దానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మీకు ఇది వరకు బిర్యానీ చేయడం వస్తే ఇది కూడా సులభం. బిర్యానీ చేయడం రాకున్నా ఇది చదివి ఈజీగా తయారు చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాల్సిన పదార్థాలు..
బాస్మతి రైస్- 400GM
నల్లయాలకులు-1
స్టార్‌ అనైజ్-1
లవంగాలు-4
యాలకులు-2
దాల్చినచెక్క-2
నెయ్యి-1 కప్పు
ఉల్లిపాయలు -1/2kg
నల్లి బొక్కలు- 600 gm
నూనె- 1TBSP
కారం-1 TBSP
గరంమసాలా -1TBSP
పసుపు-1TBSP
అల్లంవెల్లుల్లి పేస్ట్‌-2TBSP
నీళ్లు- 3/4 కప్పు
నల్లజీలకర్ర-1TBSP
బాదం -20gm
కిస్మిస్-20gm
పెరుగు-     అరకప్పు
పాలు-అరకప్పు
నిమ్మకాయ-1
పుదీనా, కొత్తిమీర
రోజ్‌ వాటర్-4TBSP


ఇదీ చదవండి: స్టీమ్డ్ లెమన్‌ ఫిష్‌ రిసిపీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుని తింటారు..


రుచికరమైన నల్లీ ఘోష్ట్‌ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా నల్లిబొక్కలను శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఓ ప్రెజర్ కుక్కర్ స్టవ్‌ ఆన్ చేసి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని నల్లిబొక్కలు, అచ్చం కూర తయారు చేసుకున్నప్పుడు ఏ పదార్థాలు వేసుకుంటామో అవి అన్ని కుక్కర్‌లో వేసుకోవాలి. నీళ్లు కూడా పోసుకుని కుక్కర్‌ మూత పెట్టి ఓ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మరో స్టవ్ పై అన్నం ఉడికించుకోవాలి. రైస్‌ మోతాదుకు డబుల్ నీరు తీసుకుని మసాలాలు కూడా వేసుకుని ఓ 70 శాతం వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి ఫ్రైడ్‌ ఆనియన్స్‌ తయారు చేసుకుని పక్కనబెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో నల్లజీలకర్ర, బాదం, కిస్మిస్ వేసి వేయించుకోవాలి.


ఇదీ చదవండి: రుచికరమైన చికెన్ సాల్నా ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా.?


ఇప్పుడు ఈ అన్నంలోకి ఫ్రైడ్‌ ఆనియన్స్, బాదం, కిస్మిస్, పుదీనా, కొత్తిమీర, రోజ్‌ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దమ్‌ పెట్టడానికి మంచి మందపాటి ప్యాన్‌ తీసుకోండి. ఇందులో నూనె వేసుకుని చిన్న మంట మీద పెట్టుకోవాలి. అడుగున కూర వేసుకోవాలి ఆ తర్వాత లేయర్ రైస్ వేసుకోవాలి. దానిపై వేయించిన బాదం, కొత్తిమీర, పుదీనా, లెమన్‌ జ్యూస్‌, ఫ్రైడ్‌ ఆనియన్స్‌, మిగతా మసాలాలు వేయించి పొడి చేసుకున్నవి వేసుకోవాలి. ఆ పైన పెరుగు కూడా వేసి అంతా స్ప్రెడ్‌ చేయాలి. ఇలాగే మరో లేయర్‌ కూడా అవ్వాలి చివరగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అల్యూమీనియం ఫాయిల్‌తో మూత పెట్టి కవర్ చేయాలి. ఇప్పుడు ఓ 30 నిమిషాల పాటు ధమ్ పెట్టాలి. వేడివేడిగా రైతాలో వేసుకుని తింటే రుచి అద్భుతం.
 



లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter