Jeera Aloo Recipe: బంగాళదుంపతో రకరకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. బంగాళదుంపలతో రిసిపీ తయారు చేసుకుంటే త్వరగా అవుతుంది. అంతేకాదు ఆలుగడ్డలతో రిసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రోజు మనం ఎంతో రుచికరమైన జీరా ఆలూ రిసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీరా ఆలూకు కావాల్సిన పదార్థాలు..


బంగాళదుంపలు- 4
ఆయిల్‌ -2tbsp
జీలకర్ర-1tbsp
పసుపు-1tbsp
ధనియాల పొడి-1tbsp
కారం-1tbsp
ఉప్పు- రుచికిసరిపడా
నిమ్మరసం-1 tbsp
కొత్తిమీర- కట్‌ చేసినవి


జీరా ఆలూ తయారీ విధానం..
బంగాళదుంపలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.  ఆ తర్వాత వాటిని నీళ్లలో కడిగేయాలి. ఇప్పుడు ఇందులో ఉన్న గంజి తొలగిపోతుంది. ఆ తర్వాత ఒక ప్యాన్‌ తీసుకుని వేడి చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. ఇందులో జిలకర్ర వేసి చిటపటలాడించాలి.


ఇదీ చదవండి: మెలనిన్ ఉత్పత్తిని పెంచి నేచురల్ గా తెల్ల వెంట్రుకలకు చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్..


ఇప్పుడు ఇందులోనే బంగాళదుంపలు కూడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు కూడా వేసి కలపాలి. మీడియం మంటపై ఆలుగడ్డలను ఉడికించుకోవాలి.  వీటిని అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఓ 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.  చిన్నగా కట్‌ చేసుకున్న బంగాళదుంపలు త్వరగా ఉడికిపోతాయి.


బంగాళదుంపలు పూర్తిగా ఉడికిన తర్వాత చివరగా నిమ్మరసం కూడా వేసుకోవాలి.  దీని వల్ల రిసిపీ పుల్లపుల్లగా బాగుంటుంది. కొత్తిమీర కట్‌ చేసి వేసుకోవాలి.  దీన్ని వేడివేడిగా చపాతీలోకి నంజుకుంటే భలే ఉంటుంది. ఈ రిపిపీ తయారు చేసుకోవడానికి కారం పొడి రుచి చూసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే చివరగా గరం మసాలా పొడిని కూడా యాడ్‌ చేసుకోవాలి. దీంతో మరింత రుచి పెరుగుతుంది. 


ఇదీ చదవండి: విటమిన్ బి 12 లోపం ఉందా? ఈ పవర్ ఫుల్ డ్రింక్ దాన్ని భర్తీ చేస్తుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.