Melanin Rich Foods: మెలనిన్ ఉత్పత్తిని పెంచి నేచురల్ గా తెల్ల వెంట్రుకలకు చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్..

Melanin Rich Foods For White Hair: మెలనిన్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు ఆరోగ్యకరమైన జుట్టుకు కారణమవుతాయి. ఇది మన జుట్టు చర్మానికి మంచి రంగును అందిస్తుంది. అంతేకాదు ఇది మన జుట్టుకు ఒక షీల్డ్‌ మాదిరి ఆల్ట్రా వైలట్‌ కిరణాల నుంచి రక్షిస్తుంది. కొన్ని రకాల ఆహారాల్లో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Melanin Rich Foods For White Hair: అంతేకాదు మెలనిన్‌ కూడా ఉండే ఆహారాలు ఉన్నాయి. ఇవి జుట్టు బలంగా మారుస్తాయి ,రంగును మెరుగుపరుస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ తో పాటు గింజలు సీట్రస్ పండ్లు క్యారెట్లు వంటివి తీసుకోవడం వల్ల కూడా మెలనీన్ ఉత్పత్తి పెరుగుతుంది.

1 /5

కాపర్ పుష్కలంగా ఉండే ఆహారాలు.. జుట్టు చర్మ ఆరోగ్యానికి మెలనిన్‌ ఉండే ఆహారాలు తినాలి. ముఖ్యంగా క్యారెట్లు, బాదాము పప్పులు, పల్లీలు, మష్రూమ్స్ వంటివి చేర్చుకోవాలి. ఇందులో ఐరన్ కాపర్ పుష్కలంగా ఉంటుంది మెలనిన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

2 /5

క్యారెట్లు.. క్యారెట్లలో కూడా బీటా కెరొటిన్‌ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్యారట్లు మెలనిన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. జుట్టును నల్లగా మారుస్తుంది క్యారెట్లు డైట్లో చేర్చుకోవడం వల్ల జుట్టు రంగు కూడా మెరుగు పడుతుంది.

3 /5

డార్క్ చాక్లెట్.. డాగ్ చాక్లెట్ కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ డార్క్‌ చాక్లెట్ లో పుష్కలంగా ఉంటాయి ఇది వైట్ హెయిర్ సమస్యను తగ్గించి మెలనిన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.  

4 /5

అవకాడో.. విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది అవకాడో లో ఇది యు వి కిరణాల నుంచి డ్యామేజ్ కాకుండా తెల్లటి జుట్టు సమస్యను నివారిస్తుంది ఆవకాడోలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి.

5 /5

విటమిన్ బి12 విటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ తెల్లజుట్టు సమస్య తగ్గిపోతుంది. గుడ్లు, పౌల్ట్రీ, డైరీ ఉత్పత్తుల్లో , చేపల్లో కూడా విటమిన్ బి12 ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)