Lemon Pepper Chicken: లెమన్ పెప్పర్ చికెన్.. నోరూరించేలా రుచి అదిరిపోతుంది..
Lemon Pepper Chicken: సండే వచ్చిందంటే చాలు చికెన్ మటన్ తయారు చేసుకుంటారు. అయితే, లెమన్ పెప్పర్ చికెన్ ఎప్పుడైనా రుచి చూశారా? దీని రుచి ఎంతో బాగుంటుంది. చికెన్ లెగ్స్ వేసి అందులో పెప్పర్, లెమన్ రెండూ కలిపి తయారు చేసుకోవాలి.
Lemon Pepper Chicken: సండే వచ్చిందంటే చాలు చికెన్ మటన్ తయారు చేసుకుంటారు. అయితే, లెమన్ పెప్పర్ చికెన్ ఎప్పుడైనా రుచి చూశారా? దీని రుచి ఎంతో బాగుంటుంది. చికెన్ లెగ్స్ వేసి అందులో పెప్పర్, లెమన్ రెండూ కలిపి తయారు చేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
కావాల్సిన పదార్థాలు.
చికెన్ లెగ్స్-4
యోగార్ట్- 3 TBSP
మిరియాల పొడి- 1TBSP
నిమ్మకాయ- అరచెక్క
ఉప్పు- రుచికి సరిపడా
పచ్చిమిర్చి -2
నూనె
కొత్తిమీర
పెప్పర్ చికెన్ రిసిపీ తయారీ విధానం..
ముందుగా చికెన్ లెగ్స్ బాగా శుభ్రం చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులో ఉప్పు, మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్, యోగర్ట్, నిమ్మరసం వేసి బాగా కలిపి ఓ అరగంటపాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్ కలుగుతాయి..
ఆ తర్వాత ఓవెన్‌లో ఒక ప్యాన్ వేసి చేసుకోవాలి. నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్స్ వేసి ఉడికించుకోవాలి. కాసేపటి తర్వాత మరోవైపు తిప్పుకుని ఉడికించుకోవాలి.రెండు నిమిషాలకు ఇలా చేస్తు ఉండాలి. ఓ 15 నిమిషాలపాటు ఇలా వండుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పచ్చమిర్చి, కొత్తిమీర, కూడా వేసుకోవాలి. కూర మొత్తం ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి