Cold Beetroot soup Recipe: బీట్‌రూట్‌ లో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు విటమిన్స్ ఉంటాయి. ఇది మన చర్మానికి కూడా ఆరోగ్యకరం. ఎండలకు చల్లదనాన్ని అందించే కోల్డ్ బీట్‌రూట్‌ జ్యూస్ ని తయారు చేసుకోండి. ఇది రుచికరంగా ఉండటంతో పాటు సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా , కోల్డ్ బీట్రూట్ జ్యూస్ ని బీట్రూట్, పెరుగు, గుడ్లు, కొత్తిమీర మసాలాలు వేసి తయారు చేసుకుంటారు. సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు..
కొత్తిమీర -ఒక కట్ట 
గుడ్డు -1
ఆరిగానో- ఒక టేబుల్ స్పూన్ 
మిరియాలు 
 బీట్రూట్-1
యోగార్డు - ఒక కప్పు 
ఉప్పు రుచికి సరిపడా
జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్
 నీళ్లు తగినంత


ఇదీ చదవండి: రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోతే ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి.. వెంటనే జాగ్రత్త వహించకపోతే..


కోల్డ్‌ బీట్రూట్ సూప్ తయారు చేసే విధానం..
ఈ కోల్డ్ బీట్రూట్ జ్యూస్ తయారు చేయడానికి ముందుగా మనం తీసుకున్న ఒక గుడ్డును ఉడకబెట్టుకోవాలి. దీనికి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని అందులో నీళ్ళు పోసి గుడ్డు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేయాలి. దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడికినత గుడ్డు ఉడికిన తర్వాత దానికి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కోల్డ్ సూప్ లో గుడ్డును గార్నిషింగ్ కి మాత్రమే వినియోగిస్తున్నాం.
ఇప్పుడు బీట్రూట్ ను శుభ్రంగా కడగాలి దీన్ని ఒక బ్లెండర్ లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు స్మూత్ పేస్ట్ లా తయారవుతుంది. ఇప్పుడు పెరుగు తీసుకొని చక్కగా చిలకాలి. పెరుగు కూడా మెత్తగా అయ్యాక బ్లెండ్‌ చేసిన ఈ బీట్రూట్ లో వేసుకొని మిగిలిన మసాలాలు కూడా వేసి కలపాలి. అంతేకాదు కట్ చేసిన కొత్తిమీర ఆకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఆరిగానో ఇక మనం ఉడికించి పెట్టుకున్న గుడ్డు కూడా వేసి క్యార్నిష్ చేసుకోవాలి.


ఇదీ చదవండి:  ముఖం పొడిబారుతుందా? కలబంద ఇలా అప్లై చేస్తే కాంతివంతంగా మెరుస్తుంది..


గుడ్డులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీట్రూట్ కోల్డ్ జ్యూస్ తో గుడ్డు తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మనం సాధారణంగా సూప్‌లను వేడి వేడిగా తీసుకుంటాం. ఈ కోల్డ్ జ్యూస్‌ మాత్రం మీకు కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ కూల్ గా కూడా తాగొచ్చు. ఈ మండే ఎండలకు ఈ కోల్డ్ బీట్రూట్ జ్యూస్ మీకు ఎంతో ఆరోగ్యకరం కడుపుకు చల్లదనాన్ని కూడా అందిస్తుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి