Spicy Egg Kheema Recipe: ప్రతిరోజు అన్నం, పప్పు, ఆకుకూరలు తిని విసిగిపోయారా? ఈసారి వెరైటీగా ఎగ్ తో కీమా తయారు చేసుకోండి. ఇది రుచిగా ఉంటుంది అతి త్వరలో అవుతుంది. దీనికి పెద్దగా ఆహార పదార్థాలు కూడా ఏం అవసరం ఉండదు. ఇది అన్నం, చపాతీకి చాలా రుచిగా ఉంటుంది. ఈ రుచికరమైన ముంబై స్టైల్ స్పైసీ ఎగ్‌ కీమా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాల్సిన పదార్థాలు..
గుడ్లు -6
నూనె - 2TBSP
ఉల్లిపాయ- పెద్దది
టమాటాలు -2
పచ్చిమిర్చి -3
అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక స్పూన్
వెల్లుల్లి రెబ్బలు-4
జీలకర్ర -1TBSP
కారం -1TBSP
పసుపు -1TBSP
ధనియాల పొడి -1TBSP
గరం మసాలా-1/4 TBSP
ఉప్పు -రుచికి సరిపడా 
కొత్తిమీర -కొద్దిగా


ఇదీ చదవండి: ఈ సమ్మర్ కూలింగ్‌ డిటాక్స్‌ డ్రింక్స్‌తో బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు..


స్పైసీ ఎగ్‌ కీమా తయారీ విధానం..
ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా ఒక పాన్ లో నీళ్లు వేసి గుడ్లు ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఉడికిన తర్వాత వేడి నీళ్లు తీసేసి నార్మల్ వాటర్ తో  గుడ్లను పొట్టు తీయాలి.
ఇప్పుడు గుడ్లను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి.


ఇదీ చదవండి: కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే ఇడ్లి, దోశ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది..


మరో పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో జీలకర్ర, ఉల్లిపాయలు ,వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు గరం మసాలా వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన గుడ్లు కూడా వేసి పైనుంచి మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు వేసుకోవాలి. అంతే స్పైసీ ఎగ్‌ కీమా రిసిపీ రెడీ. దీన్ని లంచ్‌ లోకి తయారు చేసుకోండి. అతి తక్కువ సమయం పడుతుంది. వేడివేడిగా అన్నం చపాతీలోకి ఎంతో రుచికరంగా ఉంటుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook