Sweet corn and potato fry: రుచికరమైన స్వీట్ కార్న్ పొటాటో టిక్కీని ఇలా తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ లోని తీపి. బంగాళదుంపతో రుచికరంగా ఈ టిక్కీని తయారు చేసుకోవచ్చు. గోల్డెన్ రంగులో ఉండే ఈ టిక్కీలు ఈవినింగ్ స్నాక్స్ కి ఎంతో మంచిది. వీటిని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం కూడా రుచికరమైన పొటాటో స్వీట్‌ కార్న్‌ టిక్కీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు..
బంగాళదుంపలు రెండు పెద్ద సైజు ఉడికించినవి
ఒక ఉల్లిపాయ సన్నగా తరిగినవి
ఒక కప్పు స్వీట్ కార్న్
రెండు పచ్చిమిర్చి కట్ చేసినవి
రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర
ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు
జీలకర్ర పొడి అర టీ
ధనియాల పొడి అర టీ స్పూను
పసుపు పావు స్పూను
గరం మసాలా అర టీ స్పూను
ఉప్పు రుచికి సరిపడా
నూనె డీప్ ఫ్రైకి సరిపడా


ఇదీ చదవండి: ఎర్ర క్యాబేజీతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. ఈరోజే కొని తింటారు..


బంగాళదుంప స్వీట్ కార్న్ టిక్కీ తయారీ విధానం..
ఉడకబెట్టిన బంగాళదుంపల ను మ్యాష్‌ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రెష్ స్వీట్ కార్న్ ఉపయోగిస్తున్నట్లయితే వేడి నీటిలో కాసేపు వాటిని పెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని తీసిపెట్టేసేయాలి. ఇప్పుడు కార్న్ మిక్చర్‌ తయారు చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత ఈ కారణం కూడా వేసి ఓ నిమిషం పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత వీటిని చల్లబరుచుకోవాలి.


ఇదీ చదవండి: ఈ మొక్కల ఆకులు పచ్చ రంగులోకి మారిపోతున్నాయా? ఈ చిట్కాతో చెక్ పెట్టండి  


ఉడకబెట్టిన మ్యాష్‌ చేసి పెట్టుకున్న బంగాళదుంప లో ఈ కారణ మిక్చర్ కూడా వేసి కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు కూడా వేసి టిక్కీల మాదిరి తయారు చేసుకోవాలి. ఇందులో బ్రెడ్ క్రంబ్స్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. టిక్కీ షేప్ లో తయారు చేసుకోవడానికి చిన్న చిన్న బాల్‌ లాగా తయారు చేసి వీటిని టిక్కీలా మాదిరి ప్రెస్ చేసుకోవాలి. ఈ టిక్కిలను వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ రంగులోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి