Malai Chicken Curry: రుచికరమైన క్రీమీ మలై చికెన్ కర్రీ రిసిపీ ఎలా తయారు చేసుకోవాలి?
Malai Chicken Curry Recipe: మీకు మలై చికెన్ టిక్కా అంటే ఇష్టమా ? దాని రుచి చూశారా? అయితే ఈసారి మలై చికెన్ కర్రీ తయారు చేసుకోండి. ఈ క్రిమీ టెక్చర్లో ఉండే ఈ చికెన్ రెసిపీ ఫ్రెష్ పాలు, క్రీమ్ గరం మసాలా వేసి తయారు చేసుకుంటారు.
Malai Chicken Curry Recipe: మీకు మలై చికెన్ టిక్కా అంటే ఇష్టమా ? దాని రుచి చూశారా? అయితే ఈసారి మలై చికెన్ కర్రీ తయారు చేసుకోండి. ఈ క్రిమీ టెక్చర్లో ఉండే ఈ చికెన్ రెసిపీ ఫ్రెష్ పాలు, క్రీమ్ గరం మసాలా వేసి తయారు చేసుకుంటారు. ముఖ్యంగా ఇందులో వేసే బాదం పేస్ట్, యాలకులు రెసిపీకి మంచి అరోమాను ఇస్తాయి. మలై చికెన్ రెసిపీ లో కసూరి మేతి వేసుకొని తయారు చేస్తారు. ఈ రెసిపీ కి కావలసిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు
చికెన్- 500 గ్రామ్స్
వెల్లుల్లి పేస్ట్ - 1TBSP
ఫ్రెష్ క్రీమ్ -1 కప్పు
నిమ్మరసం-1/2 TBSP
పాలు - 1 కప్పు
బే లీఫ్ -1
నెయ్యి -1 TBSP
ఉప్పు -రుచికి సరిపడా
అల్లం పేస్టు -2 TBSP
బాదం పేస్ట్ -1 TBSP
స్లైసులుగా కట్ చేసిన ఆనియన్ -1
యాలకులు -2
దాల్చిన చెక్క-1
కసూరి మేతి- 2TBSP
మిరియాల పొడి- 1TBSP
ఇదీ చదవండి: రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ..
తయారీ విధానం..
ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి దీనికోసం చికెన్ శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా క్లీన్ చేయాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ నల్ల మిరియాలు ఉప్పు వేసి కలపాలి. దీన్ని రెండు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ,పేస్ట్ బాదం పేస్టు, నిమ్మరసం, క్రీమ్ వేసి కలుపుకోవాలి. దీన్ని మరో 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఓ పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేసుకొని ఉల్లిపాయలు, యాలకులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇందులో ఆ తర్వాత పాలు, క్రీమ్, బే లీఫ్, దాల్చిన చెక్క వేసి కలుపుకోవాలి. గ్రేవీ ఉడకనివ్వాలి చికెన్ పీసెస్ పూర్తిగా ఉడికే వరకు వండుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: స్పైసీ ఎగ్ కీమా లంచ్ కి తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది..
ఇప్పుడు కసూరి మేతి కూడా ఇందులో వేసుకొని రెసిపీని బాగా కలుపుకొని ఓ నిమిషం పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి ఓ పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి
రుచికరమైన మలై చికెన్ కర్రీ రెడీ. దీని వేడిగా తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇది చపాతీ రైస్ లోకి తినవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook